దాని పేరు చెప్పండి (పొడుపు గేయం )- ఎడ్ల లక్ష్మి
కుక్కురుకూ అనుకుంటూ 
చుక్క పొద్దుకు కూసింది 
రైతును నిద్దర లేపింది 
దాని పేరు మీరు చెప్పండి 

అంబా అంటూ అరుస్తుంటే 
దాని మెడతాడు విప్పారు
తల్లి వద్దకెళ్ళి పాలు తాగింది 
దాని పేరు మీరు చెప్పండి 

కిచ్ కిచ్  అరుస్తూ వచ్చింది 
మా అద్దం మీద వాలింది 
ప్రతిబింబం చూస్తూ ఆడింది 
దాని పేరు మీరు చెప్పండి 

కిలకిల పలుకుతూ వచ్చింది 
జామ చెట్టు మీద వాలింది 
జామ పండు అది కొరికింది 
దాని పేరు మీరు చెప్పండి 


కామెంట్‌లు