ఆగని రణం!మరణం:- పైడి. రాజ్యలక్ష్మి -హైదరాబాద్
మరణం!
మరల మరల మనిషిని ఎన్నుకునే రుణం
మరో జన్మ మరో రుణం ..
ఇది ఒక ఆగని రణం
మరణం ఓ కామా, అంట,
అంతులేని ఈ సృష్టి కావ్యానికి
ఆగని కథకి,
ప్రతీ జన్మ మరో సశేష కావ్యమేనంట ,
మరణం,మరణం తరువాత
జననం…జననం తోనే వచ్చే మరణం..
నన్ను నేను ఆ అనంతం లో
కలిపి అర్థం చేసుకునే వరకూ…
కర్మ ఫలం కరిగి నా జన్మ పరంపర లన్నీ ని
ర్వాణం చెందేవరకూ…
మరణం..మరల మరల
మానిపోని ఒక రణం.

—————————-


కామెంట్‌లు