-కలనిజమయిన వేళ:- ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్

 బాల్యంలో అగ్రహారంలో
తాతయ్య చెంత నులకమంచం పై పడుకుని
రాత్రి ఆకాశంలో చంద్రుని నక్షత్రాలను చూసి
చందమామ కథలు చెప్పినపుడు
అంతరిక్షంలో కి వెళ్ళగలమా అంటే
మానవుడు సాధించలేనిది లేదని
'కృషితో నాస్తి  దుర్భిక్షం' అని చెప్పి
చదువుకుంటే నిరంతర సాధనతో
ఏమైనా చేయగలమంటే
ఆరుబయట తాతయ్య దగ్గర పడుక్కుని
కన్నకల నిరంతర సాధనతో
అత్యున్నత శ్రేణిలో ఉత్తీర్ణత చెంది
పరిశోధనలు చేసి
కలలు కనండి వాటిని నెరవేర్చుకునే మార్గంలో
అవరోధాలు ఎదురైన
వెనుదిరుగక ముందుకు సాగితే
విజయమే నీ దరి చేరు అన్న భారతరత్న 
 డాక్టర్ అబ్దుల్ కలాం గారి ప్రేరణతో
అనుకున్నది సాధించి
ఎందరో విద్యార్థులకు ఆచార్యునిగా మార్గదర్శకుడినై
అబ్దుల్ కలామ్ గారి ఆశీస్సులు పొందిన వేళ
నే అనుకున్నా కలనెరవేరిందని
అందని తీరాలకు చేరిన తాతయ్యకు
మనస్సులోనే నమస్కరించాను....!!
.........................
.
కామెంట్‌లు