వినత 8వ తరగతి చదువుతున్నది. వినత చిన్నప్పటి నుంచీ చదువులో వెనుకబడి ఉండేది. చాలా తక్కువ మార్కులు వచ్చేవి. వినత ఎప్పుడూ తన స్నేహితురాలు కమలతో ఆటలు ఆడేది. కమల మార్కులు కూడా చాలా తక్కువ వచ్చేవి. వీరి తల్లిదండ్రులు ఎప్పుడూ వీరి చదువు గురించి పట్టించుకోలేదు.
ఇటీవల వినత తండ్రి తిరుమలేశానికి తన చిన్ననాటి స్నేహితుడు అయిన పరమేశం కనబడ్డాడు. ఇద్దరి మధ్య చాలా మాటలు సాగాయి. మాటల సందర్భంలో పరమేశం తన కూతురు శివాని బాగా చదువుతున్నది అని, చిన్నప్పటి నుంచీ తన కూతురు క్లాస్ ఫస్ట్ అని చెబుతుంది. తిరుమలేశం తన కూతురు ఎలా చదువుతుందో తనకే తెలియనందుకు సిగ్గుపడ్డాడు.
తిరుమలేశం వాకింగ్ చేస్తూ వెళ్తుండగా వినత క్లాస్ మేట్ శర్వాణి కనబడుతుంది. శర్వాణితో చాలాసేపు మాట్లాడి, తన కూతురు చదువు గురించి అడుగుతాడు. వినత ఏమీ చదవదని, చదువులో చాలా వెనుకబడి ఉందని, కమల అనే అమ్మాయి సహవాసంతో ఇద్దరూ ఆటపాటలతో పొద్దు పుచ్చుతూ చదువులో చాలా వెనుకబడి ఉన్నారని చెబుతుంది. తిరుమలేశం తన తప్పు తెలుసుకున్నాడు. ఇక నుంచైనా కూతురి చదువు మీద దృష్టి పెట్టాలని నిశ్చయించుకున్నాడు. కమల ఇంటికి పోయాడు తిరుమలేశం. కమల తండ్రితో ఈ ఇద్దరు పిల్లలూ ఆటల్లో మునిగి చదువులో చాలా వెనుకబడిపోయారని చెబుతాడు. అక్కడే ఉన్న కమల ఇక నుంచి తాను కష్టపడి చదివి, మంచి మార్కులు తెచ్చుకుంటా అని ప్రమాణం చేసింది. ఇంటికి వచ్చాక తన కూతురిని నిలదీశాడు తిరుమలేశం. "ఇక నుంచి కమల సహవాసం మానేసి కష్టపడి చదువుతా." అని మాట ఇచ్చింది. "కమల కూడా ఇక నుంచి కష్టపడి చదువుతానని ప్రమాణం చేసింది. ఇద్దరూ కలసి కంబైన్డ్ స్టడీ చేయండి." అన్నాడు తిరుమలేశం. "ఇక నుంచి మంచి మార్కులు సాధించే బాధ్యత నాది. సరేనా నాన్నా." అన్నది వినత. సరేనన్నాడు నాన్న.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి