అర్థనారీశ్వర తత్వానికి ప్రతీకలు
ఆధునిక సత్యభామలే
అటు ఇల్లు ఇటు పురుషునితో సమానంగా
అధ్యాపక వృత్తి నుంచి
అంతరిక్షయానం వరకు
గ్రామ సర్పంచ్ నుంచి దేశాధ్యక్ష పదవి వరకు
సవ్యసాచి వోలె పని చేస్తున్న నేటి మహిళలు
కార్యదక్షతకు ప్రతీకలు.
శాంతి సహనాలకు మారుపేరైనా
అవసరమైతే ఆపరకాళిల వలె విజృభించిన కిరణ్ బేడీ
పర్యావరణ పరిరక్షణ కొరకు పాటుపడే మేథాపాట్కర్
పురుషులకంటే మిన్నగా
ఉగ్రవాదుల స్థావరాలను
ఆపరేషన్ సింధూర్ పేరిట
తుదముట్టించిన
కల్నల్ సోఫియా
వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ లు.
ఇన్ఫోసిస్ వ్యవస్థాపకురాలు సుధామూర్తి
అంగవైకల్యం ప్రతిభకు అడ్డుకాదని
నాట్యమయూరిగా ప్రఖ్యాతి చెందిన సుధాచంద్రన్
ఎందరో మరెందరో
నేటి మహిళలు ఆధునిక సవ్యసాచిలే
అందుకే చెప్పారు ముదితలు నేర్వని విద్యకలదే యన్నది.
..........................

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి