మనం అగ్నిగుండంలో
దూకాల్సి ఉంది..
కానీ వాడు దూకాడు
మనల్ని కాపాడాడు
మనం అది గుర్తుంచుకోవాల్సింది
ముందుకు ప్రయాణించాల్సి ఉంది
ఇంకా ప్రయత్నించాల్సి ఉంది.!!!
మనం ఆకాశంలోకి
ఎగరాల్సి ఉంది.
కానీ వాడు ఎగిరాడు ఎదిగాడు!!
మనం ఇంకా నేర్చుకోవాల్సింది.
నేల మీదనే ఇంకా ఉండాల్సి ఉంది.!!
మనం పరిగెత్తాల్సి ఉంది
కానీ వాడు పరిగెత్తాడు గెలిచాడు
మనం అలసిపోయాం
మనం కలిసి ఇంకా పరిగెత్తాల్సి ఉంది.!!
మనం చాలా దూరం నడవాల్సి ఉంది
కానీ వాడు నడిచాడు
వడివడిగా గమ్యం చేరాడు
మనం దారి తప్పాం .
మనం ఇంకా నడవాల్సి ఉంది.!!
మనం మరణించాల్సి ఉంది
కానీ వాడు మరణించాడు
అమరుడయ్యాడు
మనం ఆ త్యాగాన్ని పొగడాల్సి ఉంది
మనం ఇక తప్పించుకోలేం
మనం ఇంకా బ్రతకాల్సి ఉంది.!!!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి