జేజేలు కొడదాం:- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
మానవత్వం
మూర్తీభవించిన
మహనీయులకు
జేజేలు కొడదాం

ప్రేమతత్వం
ప్రభోధించిన
పుణ్యపురుషులకు
జేజేలు చెబుదాం

సౌభాతృత్వం
చాటినట్టీ
సుజనలకు
జేజేలు అందాం

స్వాతంత్ర్యం
సాధించినట్టి
మహానాయకులకు
జేజేలు పలుకుదాం

సేవాతత్వం
ప్రోత్సహించిన
కారణజన్ములకు
జేజేలు చెప్పిద్దాం

సమానత్వం
కోరుకున్నట్టి
శ్రేయోభిలాషులకు
జేజేలు అనమందాం

దురాచారాలను
రూపుమాపిన
సంస్కర్తలకు
జేజేలు అర్పించుదాం

దుర్మార్గాలను
ఎదిరించినట్టి
మహానుభావులకు
జేజేలు గుప్పించుదాం

బీదసాదలకు
అండగానిలిచిన
సంఘహితులకు
జేజేలు కొట్టించుదాం

నీతినిజాయితీలకు
పట్టంకట్టిన
ప్రయోజకులకు
జేజేలు సమర్పిద్దాం

సత్కార్యాలను
చేసినట్టి
శ్రేష్టులకు
జేజేలు అర్పించుదాం

సూక్తివచనాలు
చెప్పినట్టి
ధర్మాత్ములకు
జేజేలు కొట్టమందాం


కామెంట్‌లు