ఘనంగా అబ్దుల్ కలాం జయంతి: వెంకట్ , మొలక ప్రతినిధి
 బాలల మాసపత్రిక మొలక ,కవయిత్రి  మొల్ల కళావేదిక, శ్రీ రామకృష్ణ సేవా సమితి తాండూరు KGBV బాలికల పాఠశాలలో 
 తాండూర్ డిఎస్పీ బాలకృష్ణ రెడ్డి చేతుల మీదుగా విద్యార్థులకు బహుమతులు ప్రధానం
==============================================================
 వికారాబాద్ లో  జిల్లా తాండూరు KGBV బాలికల పాఠశాలలో భారత మాజీ రాష్ట్రపతి, ప్రజల ప్రియ శాస్త్రవేత్త డా. ఏ.పి.జె. అబ్దుల్ కలాం జయంతినిబుధవారం ఘనంగా నిర్వహించారు.మొదట ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డి.ఎస్.పి బాలకృష్ణారెడ్డి హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. మిస్సైల్ మెన్ ఆఫ్ ఇండియా విద్యార్థులు కలాం సార్ జీవితం నుండి ప్రేరణ పొందుతూ దేశాభివృద్ధికి తమ పాత్రను పోషించాలని ఆయన పిలుపునిచ్చారు.ఆయన దేశ రక్షణ కోసం  
క్షిపనీలను కనుగొని ఇస్రోలో పనిచేశారన్నారు ఆయన కష్టపడి చదివి పేపర్ బాయ్ నుండి రాష్ట్రపతిగా ఎదిగిన వ్యక్తి శాస్త్రవేత్తగా రాష్ట్రపతిగా చివరగావిద్యార్థులకు మోటివేటర్ గానీడారంబరజీవితాన్ని గడిపారన్నారుఆయన మన అందరికీ ఆదర్శంశ్రీ రామకృష్ణ సేవ సమితి గౌరవ అధ్యక్షులు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతగాజుల  బస్వరాజ్ పాల్గొని మాట్లాడుతూ దేశ సమగ్రతను కాపాడి విధంగా దేశభక్తులుగా విద్యార్థులను తయారు చేయాలని అన్నారు  ఈ కార్యక్రమంలోరిటైర్డ్ ప్రిన్సిపల్ బాలకృష్ణ ,విద్యావేత్త కీర్తి శర్మ, 
కవయిత్రి  మొల్ల కళావేదిక ఫౌండర్ అధ్యక్షుడు KVM వెంకట్ పాల్గొని మాట్లాడుతూ 
విద్యార్థులను సర్వతోముకు అభివృద్ధిగా తయారుచేసి మానవనులుగా ఎదిగే విధంగా కృషి చేయాలని దానికి 
అబ్దుల్ కలాం లాంటి శాస్త్రవేత్తల  జీవితాలను విద్యార్థులకు  నూరుపేయాలన్నారు
కవయిత్రి మొల్ల కళావేదిక, శ్రీ రామకృష్ణ సేవా సమితి  మొలక ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వ్యాసరచన, డ్రాయింగ్ పోటీలు నిర్వహించగా,18 స్టూడెంట్స్ గెలుపొందిన  వారికి DSp  చేతుల మీదుగా బహుమతులు ప్రధానం చేశారు. విద్యార్థులు తమ ప్రతిభ తో 
అబ్దుల్ కలాం పై సంస్కృతి కార్యక్రమాలు నిర్వహించారు.
కార్యక్రమం ముగింపుగా అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా స్మారకార్థంగా మొక్కను నాటడం జరిగింది.  
బాల కృష్ణ, గాజుల బస్వరాజ్, కీర్తి శర్మ, కవి చంద్ర శేఖర్, KVM వెంకట్ S.Oఆశలత,  టీచర్స్ స్వరూప రాణి, బాలమణి, హేమలత, శిరీష, సవిత, రాగిణి ,సంధ్యారాణి, గౌరీ, శ్రీదేవి, మంజుల, సుమలత , సులోచన  భాగ్యమ్మ   ప్రేమిల, స్వాతి వాణిశ్రీ విద్యార్థులు,  పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు



కామెంట్‌లు