బలం...ఒక జననంబలహీనతఒక మరణం...!బలం...ఓ పవిత్ర వరందేవుని ఆశీర్వాదంబలహీనత...ఓ శాప తరంగం...మనసున మిగిలేమయని మచ్చ...!బలం...ఒక అమృతబిందువుబలహీనత...ఒక విషపు చుక్క...?బలం...స్వర్గసీమలోనిఓ సౌభాగ్య సుగంధంబలహీనత...నరక కూపంలోనిఓ నిస్సహాయ నిశ్శబ్దం...!బలం...ఒక నమ్మకం...ఒక విశ్వాసం...ఒక ఆత్మ స్థైర్యంబలహీనత...ఒక బ్రతుకు భారంపరువు కరువైపోవడం...!బలం...ఓ దైవ దర్శనం...ఒక పుణ్య ప్రాప్తిబలహీనత...ఆకలితో ఉన్నమృత్యు దేవతకుఆహ్వానం అతిథి సత్కారం..!బలం...ఒక దీప్తి, ఒక ధైర్య దీపంబలహీనత...నీ నీడలో దాగిన పిరికితనం..!బలం...బంగారు ఊయల్లో ఊగేజీవంబలహీనత...ఊపిరాడని ఊబిలో మునిగే నీడ..!బలం...ఉదయించిన ఉషోదయ కిరణంబలహీనత...చిమ్మ చీకటిలో దాగిన చంద్రబింబం..!బలం...బలహీనతల...భీకర యుద్ధంలో గెలుపు బలానిదే....
బలం నిప్పు...! బలహీనత ముప్పు..!! :- కవి రత్న -సాహిత్య ధీర -సహస్ర కవి భూషణ్ -పోలయ్య కూకట్లపల్లి -అత్తాపూర్ హైదరాబాద్
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి