సప్తపది:-డా.రామక కృష్ణమూర్తి-బోయినపల్లి,సికింద్రాబాద్.

 ప్రేమ కోసం ఎన్ని కష్టాలో.
"పాతాళభైరవి" సాహసాలు చేసి,
తన వాళ్ళను పరాయి చేసుకొని,
పరిస్థితులెంత కఠినమైనా,
కారుచీకటిలో ప్రయాణం చేయాల్సి వచ్చినా,
"ఆవు-పులి" ప్రమాణం నిజాయితీగా నిరూపించినా,
రేపటి సూషోదయాలు చూస్తామన్న నమ్మకం లేకపోయినా,
చేతిలో చేయి వేసి చేసిన‌
బాస మరుపునకు రాదు.
ప్రాణమొక్కటై,కలిసి జీవించే ఆశే శ్వాసై,నడక కొనసాగుతుంది.
కాలం కాలనాగు వలె వెంటాడినా,
కనికరం లేని సమాజం అపార్థపు చూపులతో చూసినా,
నమ్మకమే బంధానికి మూలమవుతుంది.
మానవ మృగాల అరణ్యంలో
కలిలో మమతల లేమి వర్షంలో
తడిసి ముద్దవుతారు.
చినుకుల రాకకై పుడమిలో దాగున్న అంకురాల్లా అలమటిస్తారు.
త్యాగమే చివరికి మిగిలినా,
ప్రేమ ఎంత మధురం.....
ప్రేమే కదా అమృతం.
కామెంట్‌లు