అంబరవేదిక పై అలవోకగా నర్తిస్తున్న
నర్తకీమణి పాదాన్ని అంటివున్న
అందెల మువ్వలు గగన తలాన
తళుక్కున మెరుపులై మెరిసాయి
చటుక్కున తెగి భువికి జారిన గజ్జెలు
తొలకరి చినుకులై ధరణీ తలాన్ని
అలవోకగా తడపగా
భూమాత పులకాంకిత అయ్యింది
హృదయం రంజిల్లగా
చిటపట స్వరాల రాగమాలికతో
తరువులు మురిపెమ్మగా వీచాయి
చినుకు మంజీరాన్ని చుట్టుకున్న
పికము ఆనంద నాట్యము చేయగా
పులకరించిన ప్రకృతి మాత
పురుషోత్తముని ఒడలు పరవశింపజేసింది
నర్తకీమణి పాదాన్ని అంటివున్న
అందెల మువ్వలు గగన తలాన
తళుక్కున మెరుపులై మెరిసాయి
చటుక్కున తెగి భువికి జారిన గజ్జెలు
తొలకరి చినుకులై ధరణీ తలాన్ని
అలవోకగా తడపగా
భూమాత పులకాంకిత అయ్యింది
హృదయం రంజిల్లగా
చిటపట స్వరాల రాగమాలికతో
తరువులు మురిపెమ్మగా వీచాయి
చినుకు మంజీరాన్ని చుట్టుకున్న
పికము ఆనంద నాట్యము చేయగా
పులకరించిన ప్రకృతి మాత
పురుషోత్తముని ఒడలు పరవశింపజేసింది

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి