పొగాకు రహిత సమాజం మన ధ్యేయం

 పొగాకు, దుర్వ్యసనాల రహిత సమాజమే మనందరి లక్ష్యం కావాలని మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎం.ఎల్.హెచ్.పి. బి.చంద్రకళ అన్నారు. పాలఖండ్యాం ఎంపియుపి పాఠశాలలో నిర్వహించిన పొగాకు రహిత అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. పాఠశాల ప్రధానోపాధ్యాయని ఆర్.ఎల్.కుమారి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో బాలబాలికలను ఉద్దేశించి ఆరోగ్య సిబ్బంది ప్రసంగించారు. సభాధ్యక్షులు ఆర్.ఎల్.కుమారి మాట్లాడుతూ పొగాకు రహిత సంస్థగా తీర్చిదిద్దుటకు మనమంతా కృతనిశ్చయంతో ఉండాలని అన్నారు. తొలుత విద్యార్థులందరిచే ఎఎన్ఎంలు బి.ఈశ్వరమ్మ, కె.లక్ష్మీనారాయణమ్మలు ప్రతిజ్ఞ గావించారు. ఆశ కార్యకర్తలు ఎ.కుమారి, ఎన్.పద్మలు నినాదాల బోర్డులను ప్రదర్శించారు. ఆర్.ఎల్.కుమారి మాట్లాడుతూ విద్యార్థులు ధూమపానం మద్యపానం డ్రగ్స్ కల్లు సారా కొకైన గంజాయి కైనా వంటి మత్తు పానీయాలు జీవితమంతా సేవించరాదని అన్నారు. చంద్రకళ మాట్లాడుతూ పాఠశాల పరిసరాల్లో ఎలాంటి పొగాకు ఇతరత్రా అసాంఘిక కార్యకలాపాలు జరగకూడదని, వాటిని ఉత్పత్తి చేసే దుశ్చర్యలు కూడా జరగకూడదని అన్నారు. నేషనల్ హెల్త్ మిషన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమీషనర్ వారి నిర్దేశాలతో జరిగిన ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయని ఆర్.ఎల్.కుమారి, ఉపాధ్యాయులు కుదమ తిరుమలరావు, ఉప్పలపాటి ఆదిలక్ష్మి, యందువ వెంకటరమణ, వెలగాడ రాము, ముల్లు సుజాత, ఎం.పెంటయ్య, జీఎంఆర్ విద్యా వాలంటీర్ పిల్లల దాలమ్మలు పాల్గొని ప్రసంగించారు. 
అనంతరం ఎంఎల్ హెచ్ పి బి.చంద్రకళ విద్యార్థులకు మూర్ఛ, అలసట, ప్రమాదాలు సంభవించేటప్పుడు ఊపిరికి సంబంధించిన జాగ్రత్తలు ఎలా చేపట్టాలో సీపీఆర్ విధానాన్ని స్వయంగా ప్రయోగాత్మకంగా చేసి అవగాహన పర్చారు.
కామెంట్‌లు