ఎరుపైన
గులాబైన
పసు పైన
తెలుపైన
కాషాయమైన
త్రివర్ణమైన
ఋతువులు మారితే
రంగులు బయటపడతాయి.!!
బ్రతికేది ఐదేండ్లే కదా
అంత తొందర ఎందుకు
బ్రతుకులు మారవు
రంగులు మాత్రమే మారుతాయి!!?
రాళ్లు - రచయితలు
చరిత్రలు!
రాజులు-రంగులు!!
సూర్యచంద్రులు
ఇంటి ముందు ముగ్గు చుక్కలు!!
వెండి బంగారం కాదు బ్రతుకు
అంటీ అంటని పాదరసం ప్రపంచం!!
నడిచిన పరిగెత్తిన
గిరగిరా తిరిగిన
పడుకున్న కూర్చున్న
ఏడ్చిన ఎగిరిన
ఆ పని భూమి చేస్తుంది
నీవు ఒక చరమగీతం
నీవు ఒక ధరణి గీతం
నీ ధనం ఒక చిత్తు కాగితం!!?
ఆడ మగ
నీరు నిప్పు
ఎండా వాన
కొండకోన
రాత్రి పగలు
ప్రకృతి సూత్రాలు!!
మనిషి
ఒక మానసిక సూత్రం మాత్రమే!!?

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి