అది 1979వ సంవత్సరం. ఎవరూ కోరుకోని తొమ్మిది మంది నల్లజాతి అమ్మాయిలను ఆయన దత్తత తీసుకున్నారు. అయితే ఆ తొమ్మిది మందీ 46 సంవత్సరాల తరువాత ఎలా మారారో తెలిస్తే ఆశ్చర్యపోతారు.
1979లో రిచర్డ్ మిల్లర్ తన భార్య అన్నేను కోల్పోయినప్పుడు ఆయన ప్రపంచం మూగబోయింది.
ఒకప్పుడు పిల్లలతో ఇల్లంతా కళకళలాడాలి నింపుకున్న రిచర్డ్ ఇల్లు ఎవరూ లేకుండా చీకటిగుయ్యారంలా మిగిలిపోయింది. స్నేహితులు ఆయనను మళ్ళీ పెళ్ళి చేసుకోమని సూచించారు. కానీ ఆయన మనసులో అన్నే చివరి మాటలు బలంగా నాటుకుపోయాయి.
ఆయన భార్య అన్నే చెప్పిన మాట...
"మన ప్రేమ నాతో చనిపోకూడదు. దానిని సజీవంగా ఉండనివ్వు. నిస్తేజంగా ఉండనివ్వకు...."
అది తుఫానుతో కూడిన ఓ రాత్రి. విధిరాత ఆయనను సెయింట్ మేరీస్ అనాథాశ్రమంవైపు నడిపించింది. అక్కడ ఆయన తొమ్మిది మంది చిన్నారులను చూశారు. వారికి నా అనే వారున్నా ఎవరూ లేని అనాథలుగా ఆ ఆశ్రమంలో ఉంటున్నారు. వారి ఏడ్పులు కారిడార్లలో ప్రతిధ్వనించాయి. పోనీ ఆశ్రమం నుంచైనా వారిని తీసుకెళ్లాలని ఎవరూ అనుకోవడం లేదు. వారి విషయం తెలిసి అయ్యో పాపం అని జాలి పడటం తప్ప ఏమీ చేయడం లేదు.
కానీ రిచర్డ్ ని వారి కన్నీళ్ళు పిండేశాయి. మనసు అతనితో గుసగుసలాడింది.
"నువ్వు వారిని అదే ఆ తొమ్మిది మంది బాగోగులూ చూడాలి. వారిలో ఏ ఒక్కరినీ విడిచిపెట్టకు....వారు నీ మనుషులు." అని మనసు పదే పదే చెప్తుంటే ఆయన మరేమీ ఆలోచించలేదు. వారిని ఆ క్షణంలోనే దత్తత తీసుకున్నారు. ఈ విషయం తెలిసిన వారందరూ ఆయనను ఓ పిచ్చివాడనుకున్నారు. అంతెందుకు సామాజిక కార్యకర్తలమనుకునే వారూ ఆయనను అనుమానించారు. బంధువులు ఆయనను ఎగతాళి చేశారు. ఇరుగు పొరుగువారు ఆయనకు వినిపించేలా "ఒక శ్వేతజాతీయుడు తొమ్మిది మంది నల్లజాతి అమ్మాయిలను పెంచి పెద్ద చేసి ఏం ఉద్ధరిస్తాడు?" అని చెప్పసాగారు.
కానీ రిచర్డ్ వారి మాటలను పట్టించుకోలేదు. వారికి తల్లీ తండ్రీ అన్నీ తానే అయ్యారు. వారి పోషణ కోసం రెండు షిఫ్టులలో పని చేశారు. తొమ్మిది మందినీ కంటికి రెప్పలా చూసుకున్నారు. రాత్రులు లాలిపాటలు పాడి నిద్రపుచ్చే వారు. ఉదయం వారికి స్నానాలు చేసి బట్టలు తొడిగి తల దువ్వి జడలు వేసి చక్కగా తయారు చేసేవారు. వారికి కావాల్సిన పనులన్నింటినీ ఓ తల్లిలా చేసేవారు. ఎప్పుడూ విసుక్కుని ఎరగరు. ఎన్ని సవాళ్ళు ఎదురైనా ఒత్తిళ్ళను అధిగమించి నవ్వులను చిందిస్తూ తన భార్య అన్నే మాటలు చెప్తూ ఆ తొమ్మిది మంది అమ్మాయిలను చక్కగా తీర్చి దిద్దారు. ఒక్కొక్కరిలో ఒక్కో ప్రత్యేకం. ఒకరిలో అందమైన నవ్వు. మరొకరు అల్లరి పిల్ల. ఇంకొరిలో దయతో కూడిన హృదయం. ఇలా ఒకరి తర్వాత ఒకరు, తమను పెంచి పోషించిన ఆ వ్యక్తిని ఎప్పటికీ మరచిపోలేని మరచిపోని మహిళలుగా ఉపాధ్యాయులుగా, నర్సులుగా, తల్లులుగా ఎదిగారు.
ఇప్పుడు, 2025లో, రిచర్డ్ తన చుట్టూ గుమిగూడిన తన ప్రకాశవంతమైన కుమార్తెలను చూసి, అన్నే చివరి మాటగా చెప్పిన ప్రేమనే అద్భుతాన్ని పంచుతూ దానికి ప్రతిగా పొందుతున్న అందమైన ప్రేమతో తన ప్రపంచాన్ని వర్ణయం చేసుకున్నారు. ఒకప్పుడు కించపరచిన అవహేళన చేసిన వారే ఇప్పుడు ఆయనను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఆహా ఓహో అని కీర్తిస్తున్నారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి