శజ్ఞ్కర భగవత్పాదులు - కనకధారా స్తోత్రం
 ఓం కేదారేశ్వరాయ నమః
ఓం బోధలక్ష్మ్యై నమః
ఓం విజ్ఞానలక్ష్మ్యై నమః
ఓం స్థైర్యలక్ష్మ్యై నమః


శ్లోకం:
శ్రుత్యై నమోస్తు శుభకర్మ ఫలప్రసూత్యై
రత్యై నమోస్తు రమణీయ గుణార్ణవాయై |
శక్త్యై నమోస్తు శతపత్ర నికేతనాయై
పుష్ట్యై నమోస్తు పురుషోత్తమ వల్లభాయై || 11 ||*

తా.:
పుణ్యకార్యముల ఫలములు ఇచ్చే శృతి రూపిణివి అయిన నీకు నమస్కారము. ఆనందాన్ని పంచే అన్ని గుణాలను కలిగి సముద్ర అయిన లక్ష్మీదేవి కి నమస్కారము. నూరు దళములు కలిగిన పద్మములో కూర్చున్న శక్తి రూపిణివి అయిన నీకు నమస్కారము. పురుషోత్తముడైన నారాయణుని కి ప్రియ పత్నివై పుష్టి రూపిణిగా వున్న నీకు నమస్కారము. 
భావము:
శృతి , స్మృతి, పురాణాలలో నిండి వుండి, భూమండలంపై వున్న మాకు శక్తిని, పుష్టిని పుష్కలంగా ఇస్తున్న శక్తి, పుష్టి రూపిణిగా వుండి, నూరూ దళాలు కలిగిన పద్మములో కూర్చుని, నూరు చేతులతో, ఈ జగత్తులో మానవుల మైన మేము చేసే అన్ని శుభ కార్యాలకూ మాకు ఇవ్వవలసిన శుభ ఫలాలను ఇస్తున్న నారాయణుని ఇష్ట సఖి లక్ష్మిగా వున్నావు. ఇంతటి శక్తివంతమైన నీకు మనసా వాచా కర్మణా నమస్కరిస్తున్నాను.!!
....... ఓం నమో వేజ్ఞ్కటేశాయ
కామెంట్‌లు