నూతన సాంఘిక శాస్త్రోపాధ్యాయునికి స్వాగత సన్మానం

 కడుము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్రోపాధ్యాయునిగా నూతనంగా ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన లిగితిపురి షణ్ముఖరావును శుభాకాంక్షలు తెలుపుతూ ఘనంగా స్వాగత సన్మానం గావించినట్లు ప్రధానోపాధ్యాయులు గొర్లె తిరుమలరావు తెలిపారు. 
సాంఘిక శాస్త్రోపాధ్యాయులు బండారు గాయత్రి, కుదమ తిరుమలరావు, గుంటు చంద్రంలు ప్రత్యేక జ్ఞాపికనందజేసి శుభాభినందనలు తెలిపారు. సభాధ్యక్షులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు గొర్లె తిరుమలరావు, ఉపాధ్యాయులు బొమ్మాళి వెంకటరమణ, పెయ్యల రాజశేఖరం, జక్కర వెంకటరావు, పడాల సునీల్, ముదిల శంకరరావు, యెన్ని రామకృష్ణ గేదెల వెంకట భాస్కరరావు, మాచర్ల గీత, మజ్జి శంకరరావు, వసంత రాజారావు, జి.నరేష్ రామ్ జీ, యందవ నరేంద్ర కుమార్ బోధనేతర సిబ్బంది సస్మితా పాఢి, సింగంశెట్టి మురళీకృష్ణలతో పాటు, పూర్వ ఉపాధ్యాయులైన తూతిక సురేష్, బండారు గాయత్రి, వల్లూరు లక్ష్మునాయుడు, బత్తుల వినీల, జన్ని చిన్నయ్య, కుదమ తిరుమలరావు, బోనెల కిరణ్ కుమార్, గుంటు చంద్రం లు ఈ స్వాగత సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. తనకు జరిగిన సన్మానం, సుగుణాత్మక బాధ్యతను, విలువలతో కూడిన విద్యాప్రమాణాలను బాలబాలికలకు అందించేందుకు ప్రోత్సాహకరమని నూతన సాంఘిక శాస్త్రోపాధ్యాయులు లిగితిపురి షణ్ముఖరావు ప్రసంగించి కృతజ్ఞతలు తెలియజేశారు.
కామెంట్‌లు