దేవుని దయ: : - అచ్యుతుని రాజ్యశ్రీ

 క్లాసులో పిల్లలు అంతా దేవుళ్ళ కథలు అవి చెప్పుకుంటున్నారు కార్తీక మాసం శివుని అభిషేకాలు పూజలు మొదలవుతాయి అని శివ అన్నాడు లతా మూతి ముడిచి అంది నేను ఏ దేవుని పూజించను గుడికి వెళ్ళను ఎందుకంటే దేవుడు నేను ఏది అడిగినా ఇవ్వటం లేదు అందుకని నేను దేవుని తలవను ఈ మాటలు విన్న టీచరు ఇలా అంది చూడు లతా దేవుడు మన పూర్వజన్మ కర్మలను బట్టి జీవితాన్ని ప్రసాదిస్తాడు ఈ జన్మలో మనం మంచి పనులు చేస్తూ ఉంటే మనకి అంత సకారాత్మకంగానే కనిపిస్తుంది దేవుడు మన కోరుకున్నది ఇస్తే అది ఆయన చూపిన మార్గం అనుకోవాలి మనం ఎంత వేడినా కోరుకున్న మన కోరిక నెరవేరకపోతే అది మన మంచికే మన రక్షణ కోసమే అని భావించాలి ఎలా అంటే నువ్వు రోడ్డు మీద వెళ్తూ ఉంటావు అప్పుడు ఒక ముళ్ళు నీ కాలిలో గుచ్చుకుంటుంది అబ్బా అని దాన్ని తీసి పారేయగలవు అదే ముళ్ళు కంట్లో గుచ్చుకుంటే కన్ను పోతుంది కదా కాబట్టి ఈ చిన్న గాయంతో దేవుడు కాపాడాడు అని భావించాలి మనం ఇతరులతో పోల్చుకొని నాకు పెద్ద ఇల్లు లేదు కారు లేదు అని బాధపడకూడదు అవి కొన్న అప్పుల బాధ పీడిస్తూనే ఉంటుంది మనశ్శాంతి ఉండదు పిల్లలకి ఏదైనా సుస్థి చేస్తే తల్లి వాడు అడిగినా కూడా బయట నూనె పదార్థాలు పెట్టదు ఇంట్లోనే స్వయంగా తయారు చేసి కొద్దికొద్దిగా పెడుతుంది అదే విధంగా దేవుడు మన మంచి కోసరం మనకు కావలసినంత వరకే ఇస్తాడు ఎక్కువ దురాశకపోతే మనకు మిగిలేది బాధ అప్పు లు చివరికి చిప్పలు అనే స్థితికి చేరుతాం దైవస్మరణతో మన కష్టాలు బాధలు తీరిపోతాయి డాక్టర్ మందు రాసిచ్చి తాగమంటే అది చేదుగా ఉంది నేను తాగను అని మొండికేస్తే మనకే నష్టం రోగం ఎక్కువైతుంది అలాగే ఏది దొరికినా మన మంచికే అని సకారాత్మక భావం పెంపొందించుకోవాలి శివ అన్నాడు ప్రతిదీ దేవుడి మీద నెట్టకుండా మానవ ప్రయత్నం కూడా చేయాలి. ఎలా అంటే బండిని తోలేవాడు ఎద్దుల్ని కట్టి అదిలించాలి ఎద్దుల్ని వాటి ఇష్టం వచ్చినట్టు పోనిస్తే బండి బోల్తా కొడుతుంది కాబట్టి దేవుడికి ధన్యవాదాలు తెలుపుతూ పోల్చుకోకుండా నీ ఆనందం నీవు చూసుకోవాలి తక్కువలో తక్కువ ఆనందంగా ఉండే ప్రయత్నం చేయాలి ఎక్కువ వస్తువులతో ఇల్లంతా నింపితే గజిబిజిగా గందరగోళంగా ఉంటుంది అలా కాక మనకి కావాల్సినవి మాత్రమే కోరుకుంటే హాయిగా తృప్తిగా మనం బతకగలం ఇవన్నీ చెప్పిన టీచర్ వైపు పిల్లలు ఆరాధనగా చూశారు నిజమే కదా మరి క్లాసులు పిల్లలకి టీచర్ పాఠం చెప్తుంది కానీ అందరికీ సమాన మార్కులు రావు అదే విధంగా మనం ఒక విషయాన్ని ఆలోచించడంలో తెలుసుకోవటంలో తృప్తి పడాలి కొత్తదాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి దీన్నే పాజిటివ్గా ఆలోచించటం సకారాత్మకంగా భావాలు కలిగి ఉండటం అని అంటారు టీచర్ మాటలతో పిల్లల్లో కొత్త ఉత్సాహం వచ్చింది నవంబరు వచ్చేస్తోంది పరీక్షలు కూడా ఇక నాలుగైదు నెలల్లో వస్తాయి కంగారు పడకుండా ఇప్పటినుంచి ఏరోజు పాఠం ఆరోజు చదువుకుంటే మనసు ప్రశాంతంగా ఉండి పరీక్షలు బాగా రాస్తాం టీచర్ మాటలతో పిల్లల్లో ధైర్యం ఉత్సాహం కలిగాయి🌹
కామెంట్‌లు