శ్రీపురం ఉన్నత పాఠశాలలో వాసు, రాములు ఒకే తరగతి చదువుతున్నారు. ఆ తరగతిలో ఇద్దరూ అత్యంత తెలివైన విద్యార్థులు. ఎప్పుడు ఎవరు మొదటి ర్యాంకు వస్తారో చెప్పడం కష్టం.
ఒకరోజు వాసు "రామూ! మూడు రోజుల్లో పరీక్షలు ప్రారంభం అవుతున్నాయి. రేపు, ఎల్లుండి సెలవులు కదా! ఈ రెండు రోజులూ మా ఇంటికి రా! కలసి చదువుకుందాం. మరిన్ని మార్కులు పెంచుకుందాం." అన్నాడు. మరునాడు ఉదయం రాము వాసు ఇంటికి చేరాడు. కొద్దిసేపు చదువుకున్న తర్వాత వాసు టి.వి. ఆన్ చేశాడు. "ఈ ప్రోగ్రాం చూడు. మధ్య మధ్య రిలీఫ్ కోసం ఈ స్టోరీస్ చూస్తూ ఉంట." అన్నాడు వాసు. రాము చాలా ఆసక్తిగా చూస్తున్నాడు. పది నిమిషాల తర్వాత వాసు, "రామూ! నాకు ఇంట్లో సాయం చేసే వేరే పనులు ఉన్నాయి. పనులు అయిపోయాక నీ దగ్గరకు వస్తా." అని వెళ్లిపోయాడు. రాము చాలా ఆసక్తిగా ప్రపంచాన్ని మరచి మరీ టీవీ చూస్తున్నాడు. వాసు వేరొక గదిలోకి వెళ్ళి ఏకాగ్రతతో చదువుతున్నాడు. రెండు రోజులు ఇదే పరిస్థితి.
రాము తన పుట్టినరోజుకు వాసును మాత్రమే ఆహ్వానించాడు. మంచి భోజనం ఏర్పాటు చేసినాడు. ఆ తర్వాత తన నాన్న సెల్ ఫోన్ తీసుకువచ్చి ఆసక్తికరమైన గేమ్స్ చూపించాడు. ఇంకా సెల్ ఫోన్లో రకరకాల ఫీచర్స్ చూపించాడు. సోషల్ మీడియా ద్వారా బాగా ఎంజాయ్ చేయవచ్చని తెలుసుకున్నాడు వాసు. ఆ తర్వాత ఇంటికి వచ్చాక ఆరోజు నుంచీ పూర్తిగా సెల్ ఫోనుకు బానిస అయినాడు. చదువు పూర్తిగా దెబ్బ తిన్నది. వాసు తనను ఇంటికి తీసుకువచ్చి పూర్తిగా టీవీకి తనను బానిసను చేయడం తన చదువు చెడగొట్టడానికే అని ఆలస్యంగా గ్రహించాడు రాము. ఆ తర్వాత రాము వాసూ చదువు చెడగొట్టడానికి వాసును సెల్ వలలో పడేశాడు. తాను తీసిన గోతిలో తానే పడ్డాడు వాసు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి