రెండక్షరాల పదం నాన్న
నాన్న అన్న పిలుపులో,
మాధుర్యం మంచు కొండంత.
మమతానురాగం చెప్పతరం కానంత.
మెరుపై మెరుస్తాడు.
మేఘమై గర్జిస్తాడు.
నాన్న మాటేమో నియంత
మనసేమో మంచి శిఖరమ అంత.
రెక్కల కష్టం తనలో దాచుకొని
స్వేదమై కరుగుతూ..
మన కన్నీ సమకూర్చే
అక్షయపాత్ర నాన్న
అడుగులో అడుగై
ఆఖరి వరకు గొడుగై
మన ఎదుగుదలలో
తన ఆనందం వెతుక్కుని
అదే తన జీవిత పరమార్ధ
మనీ తలచే
అల్ప సంతోషి నాన్న.
కష్టం నష్టం ఓరుస్తూ
తనకు తానే అన్ని భరిస్తూ
ఆత్మాభిమానపు ఊపిరి వేర్లు నాన్న.
మన గమనానికి ఆయువు పట్టు.
ప్రతి విజయానికి తొలిమెట్టు
మన జీవిత గమనంలో
నడకై . . నడతై
ధైర్యమై గంభీర్యమై.
గుండె నిబ్బరాన్ని నింపే నాన్న.
పిల్లల విజయాలను చూసి మురుస్తూ
అదే తన జీవితాశయంగా ఎంచుతూ
కాలంతో కరిగిపోతాడు నాన్న.
నాన్న నీకు ఎవరు సాటి
ఎప్పటికీ నీవు నీవే నాన్న

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి