మనమందరం కలుద్దామని
మన తల్లిదండ్రులు గతించినా
తల్లితోడ బుట్టిన మామయ్యలున్నారు
మనం మనుమల తండ్రులమయ్యాము
మామయ్య కి ఎనుబది సంవత్సరాలు పైనే
మనలో కూడా అందరికి ఏబది నుండి డెబ్బది ఏండ్లు దాటాయని
శాస్త్రి అన్నయ్య చెబితే
అమ్మమ్మ ఎనిమిదిమంది సంతానంలో మనుమలం
సుమారు ఎనభైమంది
దేశ విదేశాల నుంచి వచ్చి
రెండు రోజులు హైదరాబాద్ లో గడిపినపుడు
బాల్యంలో అనకాపల్లిలో జరిగిన కనుమనాటి
బొజ్జన్నకొండ తీర్థం
ఉగాది నాటి నూకాలమ్మ జాతర
పాఠశాల మాని చూసిన జగదేక వీరునికథ
ఐ.ఐ.టి లో అరవై ఏండ్ల క్రిందటే చదివి
తాతయ్యలాగే వేదం కూడా నేర్చిన మామయ్య
ప్రసాదం మేనల్లుడే కాదు
దివంగత అన్నయ్య
రాష్ట్రపురస్కార గ్రహీత
భౌతిక శాస్త్ర అధ్యాపకుడు
నాగభూషణం అన్నయ్య అల్లుడు
వాడు రసాయనశాస్త్ర అధ్యాపకునిగా విశ్రాంత జీవనం గడుపుతున్న
తెలుగు సాహితీ సేవ చేస్తున్నాడని
అత్యంత ఘనంగా బంధువుల మధ్య
విద్యుత్ శాఖలో ఇంజనీర్ గా అత్యున్నత హోదాలో పనిచేసి
ప్రశాంత జీవితాన్ని గడుపుతున్న
మామయ్య వేద ఆశీర్వచనంతో
సన్మానించినపుడు
ఏబది ఏండ్ల క్రిందట
అమ్మ చెప్పినది
ఎంత ధనం సంపాదించావన్నది కాదు
ఎంతమంది నీ వెనుక ఉన్నారన్నది ముఖ్యమన్నది జ్ఞప్తికి వచ్చింది
ఎన్ని సరస్వతీ సభలలో సత్కారాలు పొందినా
మా కుటుంబ ఆత్మీయ సమ్మేళనం నాడు మామయ్యచే
జరిగిన సత్కారం
'న భూతో న భవిష్యతి'
నీవు శ్రీరామచంద్రుని దరి చేరినావని
ఆర్ద్రత కలిగినా
'జాతస్యహి ధృవో మృత్యు:'
అని తెలిసినా
నీ జ్ఞాపకాలను మరువలేకున్నా..!!
( ఈ మధ్యనే శ్రీరాముని దరి చేరిన మేనమామ విశ్రాంత ఎలక్ట్రికల్ ఇంజనీరు ఆధ్యాత్మిక వేత్త అమ్ము వెంకట రమణ గారి గురించి ఆర్ద్రత తో వ్రాసిన అక్షర నివాళి).
............................
మరచిపోలేకున్నా మామయ్య:- కవిమిత్ర, సాహిత్యరత్న-ఆచార్య అయ్యల సోమయాజుల ప్రసాద్-(పుష్యమి)-హైదరాబాద్.
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి