చిత్ర స్పందన : - బృంద
ప్రభవించు వెలుగులలో 
పరిమళించు ప్రకృతికి
ప్రతిదినము పరవశమే 
ప్రతి క్షణమూ ప్రమోదమే!

జగతిని జాగృతం చేసి
జతగా అడుగులు వేసి 
జనులకు మేలును చేయ 
జట్టిగొన్న జగచ్చక్షువు...

కనులముందు కనిపించి
కాలమున కనుగుణముగా
క్రమము తప్పక  మార్పును
కలిగించు కర్మసాక్షి!

సర్వదేవతల ప్రతిరూపమై 
సకల సృష్టికి ఆధారభూతమై
సమస్త లోకములకు మిత్రుడై
సర్వేశ్వరుడై ఏతెంచు సవిత్రుడు

పంటలకు పచ్చదనమై
పృథ్వి కి వెచ్చదనమై
పగలు రేయి కి కారణమై
ప్రగతిశీల పయన చోదకుడైన 

ప్రభాకరుని దివ్య ప్రభలకు 

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు