కన్నతల్లి ఇందిర...కన్ను మూసిందిర:- కవి రత్న -సాహిత్య ధీర -సహస్ర కవి భూషణ్ -పోలయ్య కూకట్లపల్లి-అత్తాపూర్, హైదరాబాద్.
విశాల భారతావనిని
అద్వితీయంగా పరిపాలించి
విశ్వశాంతి స్థాపనకై అహర్నిశలు 
పరితపించి విశ్వాస ఘాతకులైన 
అంగరక్షకుల అమానుషత్వానికి
...బలిపశువులా ఇందిర...బలైపోయిందిర

కారుచిచ్చులా దహించే
కటిక దారిద్య్రంలో జీవించే
కార్మిక కర్షక బ్రతుకుల్లో
కారుచీకట్లు తొలిగించిన...
కాంతి రేఖలు వెలిగించిన...
...కన్నతల్లి ఇందిర...కన్నుమూసిందిర

విదేశీయుల మద్దతుతో
విజృంభించే విచ్ఛిన్నకర శక్తులు 
తీవ్రరూపం దాల్చి దేశాన్ని చీల్చి
ప్రజల రక్తాన్ని పీలుస్తాయని... 
ప్రజాస్వామ్యాన్ని కూలుస్తాయని...
...చింతిస్తూ ఇందిర...చితికి చేరిందిర

అనేక సూత్రాలు అమలు పరచి
ఆర్థిక పరిస్థితులు మెరుగు పరచి 
అట్టడుగునున్న బడుగు వర్గాల
ఆకలి బాధలు తీర్చిన...
ఆశలన్ని నెరవేర్చిన...
...ఆశాజ్యోతి ఇందిర...ఆరిపోయిందిర

అగ్రరాజ్యాలు ఉన్మాదంతో
ఉగ్రరూపం దాల్చక మునుపె
అనంత విశ్వాన్ని భస్మం చేసె 
అణుబాంబులను పేల్చక మునుపె
అణు యుద్ధాన్ని ఆపమని...
అగ్రరాజ్యాలను ఆదేశించమని...
దాగివున్న ఆ దైవాన్ని
...అర్ధించ ఇందిర...అసువులు బాసిందిర

త్రాగిన మైకంలో
తల తిరిగె తరుణంలో
కన్నీరు నింపిన కలంతో
విధి వ్రాసిన నిరుపేదల
"తలరాతల రాజ్యాంగాన్ని"
...సవరించ ఇందిర...స్వర్గానికేగిందిర





కామెంట్‌లు