సుప్రభాత కవిత : - బృంద
కెరటాల రాకపోకలు
కాలానికి ప్రతీకలు
కరుగుతున్న ప్రతిక్షణమూ
కలసిపోవు కడలిలో!

వేచిఉన్నా తిరిగిరానిది
వగచినా  వినిపించుకోనిది
వాదించినా మార్చలేనిది
వదులుకున్న అవకాశాలే!

వరమే ప్రతిదినము
వదులుకోకు ఏ ఆనందమూ!
వేలు పోసి  కొందామని ఆనక
వేడుకున్నా దొరకదు అదనము!

అలలు ఎన్ని వచ్చినా
అంబుధిలో కలిసేవే!
ఆవేశాలెన్ని వచ్చినా
అంతరంగంలో అణిగేవే!

కాళ్ళు తడిపే కెరటాలు 
కళ్ళు తడిపే మమతలు 
సుళ్ళు తిరిగే గుండాలు
ముళ్ళు పడిన మనసులు!

సాగరమంటి జీవితంలో 
ఉప్పొంగే ఉదయాలు 
ఊరించే  ఉహాలతో 
ఉయ్యాలూపే క్షణాలు!

మేలుకోరే వేకువకు
 
🌸🌸సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు