శంకరాచార్య విరచిత -ద్వాదశ లింగ స్తోత్రము :- కొప్పరపు తాయారు

 శ్లోకం: సహ్యాద్రిశీర్షే విమలే వసంతం గోదావరితీరపవిత్రదేశే ।
యద్దర్శనాత్ పాతకం పాశు నాశం ప్రయాతి తం త్ర్యంబకమీశమీడే ॥ 10 ॥

భావం:
సహ్యాద్రి పర్వతాలపై పవిత్రమైన గోదావరి తీరంలో వెలసి ఉన్న త్రియంబకేశ్వరుడిని నేను స్తుతిస్తున్నాను. ఆయన దర్శనంతో పాపాలు తక్షణమే నశిస్తాయి. 
సహ్యాద్రిశీర్షే విమలే వసంతం: సహ్యాద్రి పర్వత శిఖరాలలో నిర్మలమైన పవిత్ర స్థలంలో నివసించేవారు.
గోదావరితీరపవిత్రదేశే: గోదావరి నది ఒడ్డున ఉన్న పవిత్రమైన ప్రదేశంలో ఉన్నవారు.
యద్దర్శనాత్ పాతకం పాశు నాశం ప్రయాతి: ఎవరి దర్శనంతోనైతే పాపాలు తక్షణమే నశించిపోతాయో.
తం త్ర్యంబకమీశమీడే: అటువంటి త్రియంబకేశ్వరుడిని నేను స్తుతిస్తున్నాను. 
.         ******

కామెంట్‌లు