సామెతల ఊట- సునందమ్మ నోట: - వురిమళ్ల (భోగోజు) సునందా ఉపేందర్ రావు, ఖమ్మం

 సామెత -9;-అన్నీ ఉన్న ఆకు (ఇస్తరాకు)అణిగిమణిగి ఉంటుంది - ఏమీలేని ఆకు ఎగిరెగిరి పడుతుంది

****
"అవ్వా! అవ్వా! గియ్యాల మా బళ్ళో  పెద్ద లొల్లయింది.నాకైతే మస్తు బయ్యమయ్యింది. పెద్ద పెద్ద గుతుపకట్టెలు పట్టుకోని రౌడీల్లెక్క కొంతమందిరి వొచ్చిండ్రు. గియ్యాల మా సార్లు మస్తు పరేషాన్ అయ్యిండ్రవ్వా! మా  సార్లు ఎంతొద్దన్నా కిటికీల్లోంచి సినిమా లెక్క జూసినం.మా పెద్ద సారు అందర్నీ సముదాయించి లొల్లి ఆపుజేయించిండు.లేకుంటెనా   ఎవ్వలివో ఒకలివి తలకాయలు పగిలేయి".
బడినుంచి వచ్చిందో లేదో భూలచ్మి  "వసదాగిన పిట్టొతికె" అవ్వెంట దిరుక్కుంట ఒకటే జెప్పుడు.
గట్లెట్ల అయ్యింది.ఊళ్ళో కొట్లాటలు బల్లె దాకెట్ల బోయినయ్.గిసుమంటి  యిషయాలు పొల్లగాండ్లను అస్సలు గుచ్చి గుచ్చి అడగొద్దు.కూపీ తీయొద్దు. ఎట్లబ్బా! అని రంధి జేస్తూ ఏం మాట్లాడక బొయ్యేతల్కి అవ్వ గూడ పరేషాన్ అయితుందట్టుంది అనుకుంటా దోస్తుల్తో ఆటకు బొయ్యింది.
 ఇంతట్లనే  అవ్వో  అవ్వా! ఏడున్నవే!పంచె ఎగదోసుకుంట, కండువా సవరిచ్చుకుంట ఆదరా బాదరా వస్తున్న మల్లేశాన్ని జూసి "ఏందిరా? ఏమైంది? ఏం తక్లీబయ్యింది? నిమ్మలపడు.ముందుగాల గీ కుర్సీల కూసో!ఇగ జెప్పు" అంది.
"ఏం జెప్పనవ్వా! గవేవో పోరగాండ్లను తిట్టొద్దు, బెత్తంతో కొట్టొద్దని సర్కారోళ్ళేవో సట్టం బెట్టిండంట గంద.అగ్గో గప్పట్నుంచే పొలగాండ్లు అదుపాజ్జల లేకుండ బొయ్యిండ్రు".
అసలు యిషయం గీ పిట్ట కతేంద్రా తమ్మీ!
అగ్గో ఆడికే వత్తన్న. పొల్లగాండ్లకు సదువెట్టాగైనా వొచ్చేలా జెయ్యాలని మన బల్లో ఓ సారు గా ఏడోతరగతి పొల్లగాండ్లకు ఓ రూల్ బెట్టిండంట. పాఠాలు సదుకొని రమ్మని అందులో విషయాలను అడుగుడు.చెప్పనోళ్ళను చెప్పినోళ్ళతో సెంపదెబ్బ ఏయించుడు.గప్పన్నించి కొంచెం బాగుపడుతన్నరకుంటే నిన్న మన పెంటిగాడి కొడుకు ఈరేశం గాని కొడుకుతో మూన్నాలుగు తేపలు సెంపదెబ్బలు తిన్నడంట.ఇంగేముంది  పెంటిగాడి కొడుకు సారు కావాలనే సెంపదెబ్బలు ఏయించిండు. సారు సంగతి ,గా ఈరేశం కొడుకు సంగతి తేలుత్తానని పక్కన దోస్తుగాళ్ళతో చెబుతుంటే విని సార్ గట్టిగా కలాస్ పీకి " ఏమి లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది అంటే గిదే.రోషముంటే సదువులో జూపెట్టాలి" అండంట. ఇంకేముంది బడొదిలే దాక పామొతికె బుసకొడుతూ ఎల్లిండంట. ఏం జెప్పిండో ఏమో పోరడు.అయ్య నలుగురి నేసుకుని గుతపకట్టెల్తో వొచ్చి ఒకటే ఈరంగం ఏసిండు. 
పాఠం ఇంటున్న ఈరేశం కొడుకును బరబరా బయటికీడ్చి" మా పొల్లగాడ్ని కొట్టడానికి ఎంత ధైర్నం రా అని నాలుగు పీకిండట. సారడ్డం బోతే మా పొల్లగాడ్ని ఏదో తిట్టినవంట గదని ఆయన మీద ఎగబడ్డడంట.యిషయం దెల్సి మేమంతా ఉరికురికి బోయినం. ఎదవ నాయాల బాగా పీకల్దాక పట్టించి వొచ్చిండు. ఏం మాట్లాడుతుండో ఆడికే తెల్వట్లే. పాపం ఈరేశానికి సర్థి జెప్పితే బాగనే ఇనుకున్నడు.ఆడు కొంచెం సదుకున్న పోరడు గాబట్టి సరిపోయింది.మర్లబడితే ఏమన్నుందా? శాల్తీలు లేశేయి."
అందుకేరా తమ్మీ! మన పెద్దోళ్ళు ఊకెనే అన్లే"  అన్ని ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది- ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుందని". ఈరేశం గాడికి ఇజ్జత,ఇవేకం ఉండబట్టి సరిపోయింది. గీ తాగుడా! గా అజ్ఞానమా! ఏది తమ్మీ! గిసుంటివి జరగడానికి కారణం. వాపోతున్న అవ్వని జూసి రెండూ అవ్వా! సదువుంటే మంచి చెడూ తెలుత్తయి.తాగితే ఒళ్ళు సోవి ఏడుంటది.నువ్వన్నట్లు .ఇయ్యే ఈటన్నటికి మూలం " అనుకుంట ఎట్టాగైతేంది పేపర్ల కెక్కకుండ,బడి అందరి నోళ్ళల్ల బడకుండా యిశయాన్ని కమ్మినం" అన్నడు మల్లేశం.
గదండీ! "అన్ని ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది - ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది"అంటే..
వురిమళ్ల (భోగోజు) సునందా ఉపేందర్ రావు, ఖమ్మంసామెతల ఊట- సునందమ్మ నోట✍️
సామెత -9
అన్నీ ఉన్న ఆకు (ఇస్తరాకు)అణిగిమణిగి ఉంటుంది - ఏమీలేని ఆకు ఎగిరెగిరి పడుతుంది

కామెంట్‌లు