సామెత -19:- అత్తింట్ల సుఖమెంత అంటే మోచేతి దెబ్బంత అన్నట్లు
***
తమ్మీ! నారాయ్ణా! ఏంది మస్తు తీర్ బార్గ కూసున్నవ్! పన్లేమి లెవ్వా! మా మర్దలేం జేత్తుంది?"
ఆ గల్లీల దుకాణానికి పందారకు బోతూ పల్కరిచ్చిన అవ్వ మాటల్కి ఉలిక్కిపడి " ఓ అవ్వో! నువ్వా! మస్తు మనాదిగుంది. ఏం జేయల్నొ తెల్వడం లేదవ్వా?
"గంత రంధిగున్నవు ఏమైంది తమ్మీ? లగ్గమైనంక తొలిపండగని బిడ్డ అల్లున్ని తోల్కొచ్చినవ్.మంచిగ కొత్త బట్టలు బెట్టి,దావత్,మర్యాజ్జేసి పంపినవ్. "బిడ్డ అల్లుడు సూడ సక్కంగ సిల్కా గోరింకల్లెక్కున్నరు" ఊళ్ళే అందరూ నారాయణ అదృట్టమే అదృట్టం.బలె సంబంధం జేసిండు అంటుండ్రు.
"ఏమదృట్టం అవ్వా! "కడ్పు జించుకుంటే కాళ్ళమీద పడుద్ది". ఎట్టున్నవ్ బిడ్డా?తల్లి అడ్గితే "మోచేతి దెబ్బంత సుకంగ ఉన్నమ్మా!" అందట.అది సిన్నప్పట్నుండి సర్దాగ మాట్లాడుద్ది గద. మాయాఁమె నాతో సెప్పుకుని మన బిడ్డ సుఖానికేం తక్వలేదని సంబురపడ్డది. " దెబ్బలు తాక్తే కాళ్ళకో,పన్జేత్తుంటే సేతుల్కో తాక్తయిగని మోసేతికెందుకు తాక్తయ్" అనుకున్నం.
"మరి బిడ్డ అక్కడ సుకంగ లేదని ఎట్ల సమజైంది తమ్మీ!
పొలంల పంజేసుకుంటుంటే దూపైందని నీళ్ళకోసం మా బాయి మెట్లు దిగుతుంటే,ఎక్కుతుంటె మోసేత్లకు బాయి గోడొర్సుకుని ఒకటే దెబ్బలు తాకుడు. పానం విలవిలమందవ్వా! ఇంట్ల పనులు జేత్తుంటే మాయాఁమెగ్గూడ మోసేతులకు దెబ్బలు తాకినయని సూపిచ్చుకుంట " ఏవఁయ్యో! అత్తింట మన బిడ్డ ఎంత కట్టపడ్తుందో అల్లుని ముందు మర్గు మాటల్తో సెప్తుంటె గప్పుడర్థం గాలేదని, గిప్పుడర్దమైందని పొద్దత్తమానం పొల్లన్న మాట యాద్దెచ్చుకుని 'కంటికి మంటికి దారగ ఒకటే ఏడుత్తుందవ్వా!" భుజానున్న కండువాతో కళ్ళు తుడ్సుకుంట బిడ్డ యిసయం జెప్పిండు.
గట్లనా తమ్మీ! గీ యిసయం నాకు తెల్వకనే పాయె. " అత్తింట్ల ఎట్లున్నవ్ బిడ్డా అంటే మోచెయ్యి దెబ్బంత సుఖంగా" అన్న సామెత గందుకే బుట్టింది.సదూకున్న పిల్ల.మీ మీద ఆపాచ్చన కొద్ది గట్ల "మర్మ గరుబంగ " సెప్పింది.
ఏంజేయమంటవవ్వా? నీకాడ్కే నేను మర్దలు వద్దామనుకున్నం."ఎతకబోయిన తీగ కాల్కి దగిల్నట్టు నువ్వే మాతానకొచ్చినవ్"
గా మాటలిని నీకెందుకు తమ్మీ! నేనున్న గద.నిమ్మలంగుండుండ్రి. రేపు గావూల్లె ఓ పనిబడింది.గాపని ఈపని సక్కజేస్కొత్త అంటుంటె గప్పుడె చాయ్ గిలాస పట్కొని వస్తూ మర్దలు మణెమ్మ " అవ్వా నీ మాటలు నోట్లో పందార, నెత్తిన పాలు బోసుకున్నట్టున్నయి" అంటుంటె అవ్వ "ఒసే మర్దలా! వొచ్చిన పని యాజ్జేషినవ్.పందారకని బోతూ గిక్కడే తట్టుబడ్డ" గబ్బగబ్బ చాయ్ తాగి మల్లొక్కపాలి దైర్నం జెప్పి అక్కడ్నుంచి కదిలింది.
గిదండీ సంగతి! "అత్తింట్ల ఎట్లున్నవ్ బిడ్డా అంటే మోచెయ్యి దెబ్బంత సుఖంగా" అనే సామెతకు అర్థం ఏమిటంటే "అక్కడకి కోడల్గా ఎల్లిన బిడ్డకు సుఖం లేదు.వాళ్ళ ఆరళ్ళను భరిస్తుందని. మన మోచేతికి దెబ్బ తాకితే ఎంత నొప్పి, బాధగా ఉంటుందో ఆ బాధ మనందరికీ తెలిసిందే.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి