సర్పయాగము
జనమేజయునకు పరీక్షిత్తు మరణ వృత్తాంతం చెప్పిన మంత్రులు " మహారాజా ఇది యుక్తం కాదని అనుకోకుండా తక్షకుడు ఒక బ్రాహ్మణుని ప్రేరణతో నీ తండ్రి మరణానికి కారణమైయ్యాడు. కనుక నీవు కూడా సర్పయాగం చేసి తక్షకుడితో సహా పాములను అన్నింటినీ అంతం చెయ్యి " అన్నారు. ఈ ఉదంతం విన్న జనమేజయుడు ఆగ్రహించి ఋత్విక్కులను రావించి సర్పయాగానికి ఏర్పాట్లు చేసాడు. ఆ సందర్భంలో వాస్తు శాస్త్ర నిపుణుడు ఒకడు జనమేజయునితో " సర్పయాగం మంచిదే కాని ఈ యజ్ఞ ప్రదేశము, కొలతలు జరుగుతున్న ఈ సమయమును బట్టి ఈ యాగం ఒక బ్రాహ్మణుడి కారణంగా పూర్తికాదు. మధ్యలో ఆగిపోతుంది " అని చెప్పాడు. జనమేజయుడు అతడిపై కోపించి "నా అనుమతిలేకుండా యజ్ఞశాలలోనికి ఎవరిని రానివ్వవద్దని" సేవకులను ఆదేశించి సర్పయాగం ఆరంభించాడు.
యాగం మొదలైంది. పాములన్ని యాగంలోపడి మరణిస్తున్నాయి.తక్షకుడు ఇది చూసి కలత చెందాడు. మిత్రుడైన ఇంద్రుని వద్దకువెళ్లి శరణు వేడాడు. ఇంద్రునికి బ్రహ్మ దేవుడు కొన్ని పాములకు అభయం ఇచ్చిన సంగతి తెలుసు. కనుక " తక్షకా నీకేమి భయం లేదు " అని చెప్పాడు. ఎన్నో భయంకరమైన, క్రోసుల పొడవు గలిగిన అనేక సర్పాలు యజ్ఞ గుండంలో పది అగ్నికి ఆహుతి అవుతున్నాయి. ఇలా సర్పాలు సర్పయాగంలో పడి మరణించడం చూసిన వాసుకి తన చెల్లెలితో " అమ్మా పాములన్నీ సర్పయాగంలో పడి మరణిస్తున్నాయి. ఇందుకు పరిష్కారం నీ చేతిలో ఉంది. నీకు నీ భర్త జరత్కారునికి పుట్టిన ఆస్తీకుడు ఈ సర్పయాగం ఆపు చేయగలడని బ్రహ్మ దేవుడు చెప్పాడు. కనుక ఆస్తీకుని పంపి ఈ యాగాన్ని ఆపించు " అన్నాడు. అది విన్న జరత్కారువు ఆస్తీకుని పిలిచి "కుమారా నీ మేనమామ మాట విన్నావు కదా నీవు వెళ్ళి సర్పయాగాన్ని నిలుపు" అని కోరింది. ఆస్తీకుడు జనమేజయుని వద్దకు బయలు దేరి వెళ్ళి యజ్ఞశాలలో వున్న జనమేజయునితో "జనమేజయా నీ పూర్వీకులైన రఘువు, మాంధాత, దశరధుడు, రాముడు, ధర్మరాజు మొదలైన మహారాజులలో ఉన్న గుణాలన్నీ నీలో ఉన్నాయి. నీవు యజ్ఞ యాగాదులు చేసి పునీతుడివి అయ్యావు. నీవు చేస్తున్న యాగం గొప్పది. సర్వ శాస్త్ర సంపన్నులచే ఈ యాగం నిర్వహించ పడుతుంది. వ్యాసుడు మొదలైన వారి రాకతో ఈ యాగం వైభవాన్ని సంతరించుకున్నది. నీకు శుభం కలుగుతుంది" అన్నాడు. ఆ స్తుతికి సంతోష పడి జనమేజయుడు ఆస్తీకునితో " మహాత్మా ఏమి వరం కావాలో కోరుకో " అన్నాడు.ఆస్తీకుడు " జనమేజయా ఈ సర్పయాగం ఆపించి నా బంధువులను రక్షించు " అన్నాడు. జనమేజయ మహారాజు ఈ సర్పయాగం తన తండ్రిని తక్షకుడు చంపాడని అందుకు ప్రతీకారంగా ఈ యాగాన్ని చేస్తున్నానని ఇది కాకుండా మరి ఏదైనా కోరామని ప్రార్ధిస్తున్నాడు. ఆ సమయంలో తక్షకుడిని లక్ష్యంగా పెట్టుకుని ఋత్విక్కులు మంత్ర పూర్వకంగా ఒకటికి రెండు సార్లు ఆహ్వానిస్తున్నా తక్షకుడు రాకపోవడంతో అతడు ఇంద్రుని శరణు వేడినట్లు దివ్య ద్రుష్టి ద్వార తెలుసుకుని జనమేజ మహారాజుకు తెలుపగా ఆ రాజు ఇంద్రునితో సహా తక్షకుని అగ్నిగుండంలో పదవేయమని ఆజ్ఞాపించగా ఆ యజ్ఞ హోత ఏకాగ్రచిత్హుడై ఇంద్రుడితో సహా తక్షుకుడిని ఆహ్వానించగా ఇంద్రుడు మంత్ర ప్రభావంచేత తక్షకుదితోసహా ఆకాశంలో భయపడుతూ వచ్చి, భయపడి " తక్షకా నీవు నీ దారిన వెళ్ళు. ఇక నేను నిన్ను రక్షించ లేను " అని తక్షకుడిని అక్కడే వదిలి తన భవనమునకు వెళ్ళాడు. తక్షకుడు భయంకరంగా భయంతో అరుస్తూ మంత్రశక్తికి ఆదీనుడై యజ్ఞగుండం లో పడబోతూ వుండగా ఆస్తికుడు"తక్షకా! ఆగు అగు అగు" అని మూడుసార్లు అనగా తక్షకుడు అక్కడే ఆగిపోయి ఆకాశంలో వ్రేలాడుతున్నాడు. అప్పుడు యజ్ఞమునకు ఆహ్వనించ బడిన సదస్యులందరూ తపస్వి అయిన ఆస్తికుడి కోరికను మన్నింప వలసినదిగా కోరాగా జనమేజయుడు సర్పయాగాన్ని ఆపించాడు.తక్షకుడు వెను తిరిగి నాగలోకం చేరాడు. ఆస్తీకుడు యాగాన్ని ఆపి సర్పాలను రక్షించినందుకు యాగశాలలోని వారంతా సంతోషించారు. జనమేజయ మహారాజు ఋత్విక్కులకు, సభాసదులందరికి వేలకోలాది ధనాన్ని ఇచ్చి సత్కరించాడు. జనమేజయ మహారాజు ఆస్తికుడిని మెచ్చుకుని "ఆస్తిక మహాశయా! భావిష్యతోలో నేను అశ్వమేధయాగం చేస్తాను. అందులో మీరు సదస్యులుగా ఉండా"లని కోరగా ఆస్తికుడు "అలాగే" అని చెప్పి సన్మానములను స్వీకరించి ఇంటికి వచ్చి తల్లికి, మేనమామకు నమస్కరించి యజ్ఞసభలో జరిగినదంతా చెప్పగా వారు సంతోశించి "నీ కోరిక చెప్పు తీరుస్తామని కోరాగా ఆస్తికుడు "ఈ కథను స్మరించిన వారికి సర్పభయం లేకుండా చేయ"మని కోరాడు. వారు సంతసించి అలాగేనని వరమిస్తారు. ఇలా నాగుల్ని ఉద్ధరించి ఆస్తికుడు వివాహం చేసుకుని పుతపౌత్రులతో ఆనందగా జీవితంను గడిపి మోక్షమును పొందాడు.
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి