శ్లోకం:
శ్రీతామ్రపర్ణీజలరాశియోగే నిబధ్య సేతుం విశిఖైరసంఖ్యైః ।
శ్రీరామచంద్రేణ సమర్పితం తం రామేశ్వరాఖ్యం నియతం నమామి ॥ 7 ॥
శ్రీరాముడు తామ్రపర్ణీ నది నీటితో నిండిన సముద్రంపై లెక్కలేనన్ని బాణాలతో సేతువు (వారధి) నిర్మించాడు. ఆ తరువాత ఆయన సమర్పించిన శ్రీరామేశ్వర లింగాన్ని నేను నిరంతరం నమస్కరిస్తున్నాను.
శ్రీతామ్రపర్ణీజలరాశియోగే నిబధ్య సేతుం విశిఖైరసంఖ్యైః: తామ్రపర్ణీ నది నీటితో నిండిన సముద్రంలో లెక్కలేనన్ని బాణాలతో (విశిఖైరసంఖ్యైః) వారధిని (సేతుం) నిర్మించి (నిబధ్య).
శ్రీరామచంద్రేణ సమర్పితం: శ్రీరామచంద్రునిచే సమర్పించబడిన (లేదా స్థాపించబడిన).
తం రామేశ్వరాఖ్యం నియతం నమామి: ఆ రామేశ్వరాఖ్యుడైన స్వామికి నేను నిరంతరం (నియతం) నమస్కరిస్తున్నాను (నమామి)
... తం శంకరం భక్తహితం నమామి. భావం: డాకిని, శాకిని సమాజంలో పిశాచాలచే సేవించబడే, భీమాది పద ప్రసిద్ధుడైన శంకరుడు, భక్తుల మేలు కోరేవాడిని నమస్కరిస్తున్నాను.
*******
శంకరాచార్య విరచిత - ద్వాదశ లింగ స్తోత్రము:- కొప్పరపు తాయారు
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి