పెళ్లి కాని గిరిజన యువతుల గా దీపావళి పండుగ : - KVM వెంకట్ మొలక స్పెషల్ కరస్పాండెంట్
  తాండూరు నియోజకవర్గంలో యాలాల, పెద్దేములు, బషీరాబాద్, తాండూర్ మండలాల లో గిరిజన తాండాలో  పెళ్లి కానీ గిరిజన యువతులు దీపావళిని వినూత్నంగా జరుపుకున్నారు. సంప్రదాయ దుస్తులు ధరించి పంట పొలాలకు వెళ్లి పూలను సేకరించిన యువతులు, వాటితో అందమైన గొబ్బెమ్మలను తయారు చేశారు. ఆ గొబ్బెమ్మలను గ్రామంలోని ప్రతి ఇంటికి పంచుతూ సంతోషాన్ని పంచుకున్నారు.
‘మంచి భర్త రావాలని, తాండాకు సుఖసమృద్ధి చేకూరాలని, పాడి పంటలు బాగుండాలని’ కోరుకుంటూ ప్రత్యేక  పాటలు పాడి నారుగ్రామీణ సంప్రదాయాలకు కొత్త శోభనిచ్చేలా యువతులు దీపావళి వెలుగుల పండుగను ఆచారపరంగా, సాంప్రదాయ బద్ధంగా జరపడం విశేషం. తండాలో ఆడపిల్లని లక్ష్మీమాతగా తండావాసులు చూస్తారు
ఈ కార్యక్రమం తాండా పెద్దలు,  గ్రామస్థుల సమక్షంలో ఉత్సాహంగా  జరిగింది ప్రకృతి, పంటలు, సంప్రదాయం కలిసిన ఈ వేడుక గిరిజన తాండా లకు ప్రత్యేక ఆకర్షణగా మారింది.


కామెంట్‌లు