ఓం కేదారేశ్వరాయ నమః
ఓం సామ్రాజ్యలక్ష్మ్యై నమః
ఓం శాంతిలక్ష్మ్యై నమః
ఓం దాంతిలక్ష్మ్యై నమః
శ్లోకం:
బాహ్వంతరే మురజితః శ్రితకౌస్తుభే యా
హారవాళీవ హరినీలమయీ విభాతి |
కామప్రదా భగవతోపి కటాక్షమాలా
కళ్యాణమావహతు మే కమలాలయాయాః || 6 ||*
తా.:
పరమపావనుడు , భగవంతుడు అయిన శ్రీహరి కి, నీవు భగవతివి. కామప్రదవూ కూడా. నీవు, నారాయణుని వక్షస్థలము పైన వుండే ఇంద్రనీలమణి, కౌస్తుభమణులతో కూడిన హారముల ప్రకాశాన్ని ఇంకా ఇనుమడింప చేస్తున్నావు. కమలాలయవు అయిన నీయొక్క కరుణా పూరిత చూపులు నాపై ఎల్లప్పుడూ నిలిపి నాకు కళ్యాణములను కలగించు తల్లీ!
భావము:
అమ్మా! నీవు ఈ భూమండలంలో వున్న అందరి కోరికలు తీర్చగల దానివి, కామప్రదవు. నీవు, భగవంతుడు అయిన శ్రీహరి కి సొంతమైన, భగవతివి అయ్యావు. నీకు వున్న, మాకు కనిపించే అందము, నీ తత్వం లో దాగివున్న అందము లతో, పరంధాముడైన నారాయణుని కూడి, నిత్య సౌందర్యువంతుడైన ఆయన అందానికే వన్నె తీసుకువచ్చావు. నీవు జగత్తు పై కరుణతో కురిపించిన అనుగ్రహాన్ని చూసి, నిన్నే తప్ప ఇతరులను తెలియని వాడిని అయిన నామీద, నీ చల్లని కరుణా కటాక్ష చూపులను ఎల్లప్పుడూ వుంచు, కరుణామయీ, కంజదళాయతాక్షి !!
....... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి