శజ్ఞ్కర భగవత్పాదులు - కనకధారా స్తోత్రం - కనకధారా స్తోత్రం:- - నాగరాజకుమార్ .MVSS-8897 839 185-9963 936 021
ఓం అర్ధనారీశ్వరాయ నమః

ఓం శాంతిలక్ష్మ్యై నమః
ఓం ఆత్మానందలక్ష్మ్యై నమః
ఓం సత్యలక్ష్మ్యై నమః


శ్లోకం:
ప్రాప్తం పదం ప్రథమతః ఖలు యత్ప్రభావాత్
మాంగల్యభాజి మధుమాథిని మన్మథేన |
మయ్యాపతేత్తదిహ మంథరమీక్షణార్థం 
మందాలసం చ మకారలయ కన్యకాయాః || 7 ||*

తా.:
జగన్నాథుని వైపు నీవు కడగంట చూసిన చూపు ప్రభావం తో, మన్మధుని కి, నారాయణుని సన్నిధిలో అత్యుత్తమమైన ప్రథమ స్థానం దక్కింది. నీవు సముద్రమంత గంభీరంగా నెమ్మదిగా కదులుతూ అందరి కోరికలు తీర్చుతున్న, సముద్రుని కుమార్తెవు.  నీయొక్క కరుణా పూరిత చూపులు నాపై ఎల్లప్పుడూ నిలిపి నాకు కళ్యాణములను కలగించు తల్లీ!

భావము:
అమ్మా! నీవు నీ ఓరకంటి చూపుతోనే, మూడు లోకాలను ఏలే జగన్నాథుని శాసించగల దానివి. అటువంటి ఒక మధుర క్షణంలో, నీవు చూసిన చూపుతోనే విష్ణుమూర్తి సన్నిధి లో ముఖ్యమైన చోటు దక్కింది, పూవింటి దొరకి. నువ్వు స్థిరమైన గోదావరి లా, నిన్ను చేరిన నీ భక్తులను కాపాడుతూ వుంటావు. ఎంతైనా, సముద్రుని గారాలపట్టివి, కదా! ఇంతటి కరుణా మూర్తి వి, నన్ను కూడా కరుణించి కృతార్ధుని చేయి తల్లీ! కాశ్మీరపురవాసినీ!!

....... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

కామెంట్‌లు