.అ...అదొక అడవి. ఆ అడవిలో అందమైన పర్ణశాల ఒకటి కలదు.
ఆ.. ఆ ...పర్ణశాల చిలుకలు, పావురాయిలు, పిచ్చుకమ్మలు, కుందేల్లు ,లేడీలతో ఎంతో ఆహల్లాదంగా ఉన్నది.
ఇ...ఇంతలో చక్కనైన ఒక లేడీ పర్ణశాల నుండి ఆహారాన్ని అన్వేషిస్తూ బయటకి వచ్చింది.
ఈ... ఈలోపలే పులి ఒకటి ఆ అందమైన హరిణాన్ని చూసింది.
ఉ.. ఉలుకు బెలుకు లేకుండా చూ...అనే...శబ్దాన్ని కూడా చేయకుండా మెల్లగా ఆ లేడీ ని చంపి తినాలి అనుకుంది.
ఊ.. ఊడల మర్రి చాటున నక్కింది ఆ లేడీ భయంతో వణుకుతూ .
ఋ.. బుుషీశ్వరుడు ఆ పర్ణశాలలో గొప్ప హోమం చేస్తున్నాడు.
ఎ.. .ఎందుకు ఈ రోజు లేడీ కనిపించడం లేదని పర్ణశాలలోని జంతువులన్నీ గాబరా పడుతున్నాయి.
ఏ.. ఏమై ఉంటుందోనని ఎంతగానో భయపడసాగాయి.
ఐ... ఐకమత్యంతో అందరు కలిసి తమ స్నేహితురాలిని వెతకాలి అనుకున్నాయి.
ఒ.. ఒకటే వేగంతో లేడీ పర్ణశాలలోకి పరిగెడుతూ వస్తోంది. దానిని పెద్దపులి వెంబడిస్తోంది.
ఓ.. ఓపిక లేక ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని, హోమగుండం ముందర పడిపోయింది.
ఔ.. ఔధార్యం చూపిస్తూ మునీశ్వరుడు అభయం ఇచ్చాడు భయపడకు నేనున్నానని.
అం... అంతలో గాండ్రు గాండ్రు మని గట్టిగా అరుస్తూ పులి అచటికి ఏతెంచింది. లేడీ పై పంజావిసిరి చంపి తిందామని. పరుగులు పెట్టింది.
అ: అ:ంతరంగ మందలి ఆవేదన తీరింది లేడీదీ. ఎందుకనగా?హోమగుండమందలి బగ్గు బగ్గు మని వెలువడే అగ్ని జ్వాలలను చూసి భయంతో భ్రాంతి చెంది పులి తోక ముడుచుకొని చేసేది లేక వెనుతిరిగి పరుగులంకించుకుంది. లేడి ప్రాణాపాయం నుండి బయటపడింది. అందుకు సోదర మిత్ర బృందమంతా ఎంతగానో సంతోషించారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి