దసరా సెలవులు: - అంకిత -ఏడవ తరగతి -Zphs నర్మెట్ట , జనగాం జిల్లా







 దసరాకు ముందు రోజు మా బడిలో బతుకమ్మ పండుగ జరుపుకున్నాము. పొద్దున అందరం మంచిగా కొత్త కొత్త బట్టలు వేసుకొని చేతిలో రకరకాల రంగురంగుల పువ్వులు పట్టుకొని వచ్చాము. ఆ తరువాత లంచుదాక చదువుకున్నాము. లంచ్ తరువాత అందరం నైన్త్ క్లాస్ లో పువ్వులన్ని ఒక దగ్గర పోసి తంగేడు పువ్వులు గునుగు పువ్వులు బంతి పువ్వులు టేకు పువ్వులు కూడా పెట్టారు.  బతుకమ్మ పేర్చారు. బతుకమ్మ పెట్టి చప్పట్లతో బతుకమ్మకు ఉయ్యాల పాటలు పాడారు. అంగన్వాడీ టీచర్లు మహిళా సంఘం వాళ్లు వచ్చి కూడా పాటలు పాడుతూ ఆటలు ఆడుతూ సంబరంగా గడిపాము .ఆరోజు జరిగిన ఆ పండుగను మేము మర్చిపోలేము. తర్వాత బతుకమ్మను ఒక చెట్టు కింద నిమజ్జనం చేసి ఇంటికి  వెళ్ళాము. తరువాత రోజు అమావాస్య రోజు పొద్దున్నే లేచి పళ్ళు తోమి తల స్నానం చేసి గుడికి పోయి దర్శనం చేసుకొని వచ్చాము. మా నాన్న అన్నయ్య పువ్వులు తెచ్చారు మా అమ్మ పాయసం చేసింది అందరం పాయసం తిన్నాము. కడుపునిండా తిన్నాము. బతుకమ్మ అని పెడుతాము నేను మా అమ్మ మా నాయనమ్మ కలిసి పేర్చాము. సాయంత్రం కాగానే అందరం తయారు అయ్యి మంచిగా బతుకమ్మ ఆడుకున్నాము. కొంచెం సేపు ఆడుకోని ఆడుకొని బతుకమ్మను చెరువు దగ్గరికి ఆడుకోవడానికి తీసుకొని వెళ్లి శివుని గుడి కాడ ఆడుకొని చెరువులో నిమజ్జనం చేసి ప్రసాదాలు పంచుకొని వచ్చాము .ఇంటికి వచ్చి అన్నం తిని పడుకున్నాము. మళ్లీ పొద్దున్నే లేచి మంచిగా స్నానం చేసి అందరం తొక్కుడు తొక్కుడు బిళ్ళ వీరి వీరి గుమ్మడి పండు ఆట కూడా ఆడుకున్నాము. అష్ట చెమ్మ ఆడుకున్నాము పుంజితం ఆడుకున్నాము కచ్చకాయలు కూడా ఆడుకున్నాము సాయంత్రం కాగానే బతుకమ్మకు పువ్వులు తెచ్చి బతుకమ్మను ఆడుకున్నాము. ఆడుకొని బోరింగ్ కాడ నిమజ్జనం చేసి వచ్చాము. ఇంటికి వచ్చి అన్నం తిని పండుకున్నాము అలాగే తొమ్మిది రోజులు అలాగే ఆడుకున్నాము. సద్దుల బతుకమ్మ రోజు మేము బతుకమ్మ ను పేర్చాము. మా అమ్మ గౌరమ్మను పేర్చి చేసి బతుకమ్మ మీద పెట్టాము .అందరం తయారు అయ్యి బతుకమ్మ పట్టుకొని మా ఇంటి వద్ద ముందు ఆడుకొన్నాము. ఆరోజే గాంధీ జయంతి గిట్ల. ధన్యవాదాలు
కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
Very nice.good naration.
Neelam Venu GHM ZPHS NARMETTA