"సౌభాగ్యభాస్కరం" - శ్రీ భాస్కరరాయలు గారు.
హయగ్రీవుడు - అగస్త్య మహాముని
అగస్త్య మహాముని.... "శ్రీవిద్యోపాసన" చూద్దాం.....
హయగ్రీవుడు: హయగ్రీవ అవతారం కథ - దేవీ భాగవతం లో - ప్రథమ స్కంధము లో చెప్పబడింది.
పూర్వం హయగ్రీవుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతని తల భాగం, గుర్రం ముఖము రూపంలో వుండేది. అందువల్ల హయగ్రీవుడు అయ్యాడు. ఈతడు, బ్రహ్మ కోసం తపస్సు చేయడం - ఆయన వచ్చి అడిగిన వరాలు ఇవ్వడం - ఆ వారాల్లో ఒక వరం - తన ముఖము వంటి ముఖము కలవాడి చేతిలోనే తనకు మృత్యువు రావాలి అని కోరుకున్నాడు. వర గర్వం - లోకాలకు బాధలు - అమాయకులు వధించబడి - హయగ్రీవునికి, మిగిలిన రాక్షసులకు ఆహారం అవడం - దేవతలు, ఋషులు సతీసమేతంగా వున్న ముక్కంటిని ప్రార్ధన చెస్తారు. "మాయా నిద్రలో వున్న విష్ణుమూర్తిని లేపండి. ఆయన ద్వారా ఈ రాక్షసుడు చంపబడతాడు", అని శంకరుడు అభయం ఇస్తారు.
అక్కడ విష్ణు లోకంలో, తన విల్లుకి గడ్డం ఆనించి నిద్రలో వున్నాడు, విష్ణుమూర్తి. దేవతలు, ఋషులు విష్ణుమూర్తి నిద్రాభంగం చేయమని శివుణ్ణి ఆరాధిస్తారు. శివుడు, చెద పురుగుగా వచ్చి, విల్లు యొక్క అల్లె త్రాడును కొరుకుతాడు. ఆ అల్లె త్రాడు అతి వేగంగా వచ్చి, విష్ణుమూర్తి కంఠంను కోసేస్తుంది. అప్పుడు, శివుడు, "గుర్రం తల తెచ్చి విష్ణుమూర్తి కి తగిలించండి" అని దేవతలకు చెప్తాడు. గుర్రం తల అతకబడ్డ విష్ణుమూర్తి కి దేవతలు అందరూ, వారి వారి శక్తులను ఇస్తారు. హయగ్రీవుడైన విష్ణుమూర్తి, హయగ్రీవ రాక్షస సంహారం చెస్తారు. లోకాలన్నీ సుఖంగా వుంటాయి.
అప్పటికే, శ్రీవిద్యోపాసకులలో ఎంతో శ్రేష్టుడైన అగస్త్యుడు, హయగ్రీవ స్వామి యొక్క అమిత భక్తుడు. "బ్రహ్మాండ పురాణం - ఉత్తర భాగంలో " చెప్పబడిన శ్రీలలితాదేవి మంత్రములు, న్యాసములు, పూజా విధానము, పునశ్చరణ విధి, హోమములు, రహస్యములు, స్తోత్రములు అనే ఏడు విషయాలను హయగ్రీవు ని నుండి నేర్చుకున్నాడు, అగస్త్యుడు. నిరంతరం, ఏమరపాటు లేకుండా, నిష్ఠతో తపస్సు చేస్తూ, శ్రీవిద్యోపాసన చేస్తున్న అగస్త్యుడు, "అత్యంత నిగూఢమైన, రహస్యమైన శ్రీలలితా సహస్రనామములు వున్నాయి" అని తెలుసుకున్నాడు. తాను నిష్ఠతో వుంటూ, హయగ్రీవ స్వామి ప్రియ భక్తునిగా వున్నా కూడా, ఆ స్వామి రహస్యాతి రహస్యములు అయిన "శ్రీలలితా సహస్రనామములు" తనకు ఎందుకు చెప్పలేదు అనే ప్రశ్న తో "హయగ్రీవ - అగస్త్య సంవాదం" మొదలవుతుంది.
హయగ్రీవ - అగస్త్య సంవాదం - రేపటి నుండి.
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి