స్ఫూర్తిదాతలు22 సేకరణ...అచ్యుతుని రాజ్యశ్రీ

 వేసవిలో చల్లదనం కోసం వట్టివేళ్ల  తడికలు నీళ్లలో వేసి ఆ నీరు తాగటంతో శుద్ధి అయ్యేది. ఇది ఈ వట్టివేళ్ళు గడ్డి జాతి మొక్క ఇసుక నేలలు బీడు భూముల్లో బాగా పెరుగుతుంది రసాయనాలు తో నీరు కలుషితం అవుతోంది కోయంబత్తూర్ లో ప్రొఫెసర్ కమాలుద్దీన్ సారా పర్వీన్ పరిశోధనలు చేసి వట్టివేళ్లతో నీటిని శుద్ధి చేయగలమని నిరూపించారు నీటిలో తేలే ట్రే లలో వట్టివేళ్ళ మొక్కల్ని పెంచారు 300 ఎకరాల్లో ఉన్న   పెరియ కులం సరస్సును ప్రత్యేక మట్టితో నింపి నా ట్రేలలో వట్టివేళ్లు పెంచారు ఇవి చెరువులోని హానికర పదార్థాలను శుద్ధి చేశాయి మనం కూడా ఇలాంటి ప్రయోగాలు మన చెరువుల్లో చేయాలి ఈ రోజుల్లో డాక్టర్ ఇంజనీర్ తర్వాత అందరికీ ఇష్టమైన మోజు ఉన్న ఉద్యోగం కలెక్టర్ లలో కూడా నూతన దృక్పథం గలవారు ఎంతోమంది ఉన్నారు గుడ్ జాబ్ కి చెందిన అమిత్ ఇంజనీరింగ్ చేసి సివిల్స్ లో 18వ ర్యాంకు సాధించి కలెక్టర్గా కేవలం ఒక్క రూపాయి మాత్రమే జీతం తీసుకుంటున్నాడు ఆయన భార్య పైలట్ ఆమె పేద విద్యార్థుల కోసం ఖర్చు పెడుతుంది తన జీతాన్ని మధ్యప్రదేశ్ కు చెందిన ఐఏఎస్ సందీప్ తన ఆఫీసు ఇతర చోట్లకి సైకిల్ మీద వెళ్తాడు దూరప్రాంతాలకు బస్సు లో వెళ్తాడు పని చేస్తూ ప్రభుత్వ కాలేజీలు స్కూలు ఇతర ఆఫీసులను తనిఖీ చేసి ప్రజల సమస్యల్ని స్వయంగా అడిగి తెలుసుకుంటాడు ఇక తమిళనాడుకు చెందిన ఐఏఎస్ ప్రభాకరన్ బాల్యంలో కూలీ పని చేశాడు రైల్వేస్టేషన్లో పడుకున్నాడు ఐఏఎస్ అయిన తర్వాత కృష్ణ భారతి అనే డాక్టర్ ని పెళ్లి చేసుకుని గ్రామాల్లో ఉచితంగా వైద్యం మందులు ఏర్పాటు చేశాడు బావులు, చెరువుల పూడిక తీయించాడు ఒక ఆసుపత్రి కూడా కట్టించాడు
కామెంట్‌లు