వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన అమ్మ నామాలలో.....
8.రాగస్వరూపపాశాఢ్యాయ
(అష్టాక్షరీ)
9.క్రోధాకారాంకుశోజ్జ్వలా(అష్టాక్షరీ)
తొమ్మిదవ నామ మంత్రము -
ఓం క్రోధాకారాంకుశోజ్జ్వలాయై నమః
ఎడమవైపు క్రింది చేతిలో "అనురాగము" అనే పాశమును పట్టిన తల్లి, తన కుడివైపు క్రింది చేతిలో "క్రోధము" అనే అంకుశాన్ని వుంచుకుని, ఈ చరాచర జగత్తును పట్టి పీడిస్తున్న దుష్టశక్తులను శిక్షిస్తున్నది. అటువంటి, జగజ్జననికి నమస్కారము.
కోపము వల్ల జీవి, విచక్షణ లేదా జ్ఞానాన్ని కోల్పోతాడు. తరతమ భేదాన్ని, ఏమి పని చేస్తున్నాము అనే ఆలోచన కూడా మనిషికి వుండదు, కోపము ఆవహించినప్పుడు. కానీ, అమ్మ కుడివైపు క్రింది చేతిలోని అంకుశము, "జ్ఞానముతో కూడిన క్రోధమును" చూపుతుంది. ఈ అంకుశము, తనయందే మనసును నిలిపిన భక్తులకు జ్ఞానాన్ని ఇస్తుంది. ఈ జగత్తు కు హానికరమైన వారికి, వారిని అంతం చేయడానికి తమ మీదికి కోపంతో వస్తున్న దండం అవుతుంది.
తనను చేరాలి, అనుకున్న సాధకునికి సరైన దారిలో వెళ్ళడానికి, క్రోధాంకార అంకుశముతో హెచ్చరికలు చేస్తూ వుంటుంది.
పరమేశ్వరి ఎడమ క్రింది చేతిలోని పాశము "రాగాత్మకము". కుడి క్రింది చేతిలోని అంకుశము "ద్వేషాత్మకము". జగద్ధాత్రి చేతులలో వున్న నాలుగు ఆయుధాలు కూడా బీజాక్షర రూపాలు. "ఆం" - పాశానికి; "క్రోం" - అంకుశానికి; "ఓం" - ధనుస్సుకు; "క్లీం" - బాణానికి.
జగన్మాతను స్మరించి నమస్కరించేడప్పుడు ఓం క్రోధాకారాంకుశోజ్జ్వలాయై నమః అని అనాలి.
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి