ఆదిశన్కర భగవత్పాదుల అంతటి మహనీయుడు శ్రీ భాస్కరరాయలు వారు, అని లలితా పరా భట్టారిక చేత చెప్పబడిన శ్రీ భాస్కరరాయలవారి చరితము తెలుసుకుందాము.
"సౌభాగ్యభాస్కరం" - శ్రీ భాస్కరరాయలు గారు.
శ్రీ భాస్కరరాయలవారి జీవిత కాలంలో అనేక మహిమాన్వితమైన విషయాలు జరిగాయి. మనం మచ్చుకు ఒక నాలుగు మహిమా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము.....
4.చంద్రసేన మహారాజు గారి భార్య గర్భవతి గా వున్నప్పుడు భాస్కరరాయలు గారి శిష్యులు, సాధకుడు అయిన నారాయణ మహారాజ్ ను తనకు పుట్టబోయే బిడ్డ, ఆడబిడ్డా, మగబిడ్డా అని అడిగింది. ఆడబిడ్డ కలుగుతుంది అని నారాయణ మహారాజ్ అన్నారు. వేరొక సందర్భంలో ఇదే ప్రశ్న, భాస్కరరాయలు గారిని అడుగుతుంది, రాణి. భాస్కరరాయలు గారు మగబిడ్డ కలుగుతుంది అని చెప్పారు. ఇదేంటి, గురు, శిష్యులు ఇద్దరూ ఒకే ప్రశ్నకు భిన్నంగా సమాధానాలు ఇచ్చారు అనుకుంది రాణి. ఇద్దరూ సిద్ధ పురుషులు. సత్యవాక్కు కలిగినవారు. వారిద్దరి మాటలనూ నిజం చేస్తూ, మానసికంగా, శారీరకంగా అత్యంత బలహినమైన నపుంసక సంతానం కలిగింది, చంద్రసేనుని రాణికి. రాణి బిడ్డ ఆలనాపాలనా చూసుకుంటొంది. తల్లి మనసు కదా!
కొంత కాలం తరువాత, భాస్కరరాయలు గారు చంద్రసేనుని దర్శనానికి వచ్చారు. తమ కుమారుని విషయం వివరించి, అతనిని తమకు యోగ్యమైన కొడుకుగా మార్చమని ప్రార్థిస్తారు, చంద్రసేన మహారాజు దంపతులు. సూర్యదేవుని అనుగ్రహం కోసం కృష్ణా నది ఒడ్డున పూజించాలి అని చెప్తారు. అప్పుడు, భాస్కరరాయలు గారి శిష్యులు కృష్ణా నది రాజమందిరానికి చాలా దూరంగా వుంది. ఆ నదిని రాజమందిరం వైపుకు తీసుకుని రండి అని గురువు గారిని ప్రార్ధించారు. అప్పుడు, గురువు గారు సూర్యదేవుని ధ్యానం చేసి, కృష్ణా నది ప్రవాహాన్ని రాజమందిరం వైపు తెప్పిస్తారు. అలా రాజమందిరం వైపు వచ్చిన కృష్ణా నది ఒడ్డున వుండి, సూర్యదేవునకు అర్ఘ్యము ఇచ్చి, ధ్యానము, ఉపాసనలు చేసి చంద్రసేన మహారాజు యొక్క నపుంసక సంతానాన్ని, యోగ్యుడైన మొగబిడ్డగా, రాజకుమారునిగా మార్చారు.
కృష్ణా నది దారి మారిన ప్రదేశాన్ని మూలిమాడు అని కన్నడ భాషలో అన్నారు. మూలిమాడు అంటే, ప్రవాహము యొక్క దారి మళ్ళించబడిన చోటు, క్షేత్రము అని అర్ధం. ఈ మూలిమాడు క్షేత్రం, ఇప్పటి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో మూలమళ్ళ గా పిలువబడుతోంది.
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి