శని దేవుని ప్రార్థన :- డి. వినాయిక్ రావు , భైంసా , ఫోన్ నం 9440749686
 సీ:శనిదేవ చరణముల్ శ్రద్ధతో మ్రొక్కుదున్ 
దయచూపు మాపైన తైలప్రియుడ 
చమురుతో స్నానము నిమురుతూ పోసేము 
మూరితిన్ తడుపుతూ ముద్దుగాను 
కష్టముల్ నివ్వక నష్టముల్ జేయక
గ్రహపీడలేమున్న కడవబెట్టు 
సంకటములుబాపి సంతసంబియ్యుమా
బ్రహ్మణ్యుండామాకు భాగ్యమిమ్ము 
తే.గీ: భాను పుత్రుడా నివ్వకు బాధమాకు 
సేవలన్నియు సలుపగన్ భావముగను 
స్తోత్రపఠనము జేసేము శుద్ధిగాను 
పీడలేకుండ చూడుమా పేర్మి చూపి

కామెంట్‌లు