దత్తాత్రేయుడు :- డి.వినాయక్ రావు , భైంసా , 9440749686
కం: అత్రి  అనసూయసుతుఁడున్
చిత్రంబుగమహిమలున్న చిరజీవతడున్ 
పత్రంబంటుగలేదున్ 
సత్రంబేదైన యుండు శాంతపురుషుడున్ 

కం: గురువగు దత్తాత్రేయుడు
పరుగున వచ్చేను తలచ భక్తిగమనమున్ 
తరువై  తోడుగ నిలువన్
పరితాపంబులనుబాపు పరమాత్ముండున్ 

కం: దత్తజయంతగు వేడుక 
చిత్తము గురువందు నిలుప శీఘ్రఫలముకై 
సత్తువనిచ్చును మనసుకు 
బిత్తరమున్ త్రోలి మనము భీతిని బాపున్


కామెంట్‌లు