శివుడే రా దేవుడు:- గుర్రాల లక్ష్మారెడ్డి కవి రచయిత-సెల్9491387977 కల్వకుర్తి
శివ శివ శివ నీవు అను
శివనామం వెంటనే విను
శివుడేకదరా నీ దేవుడు
బొందిలో ఉండే జీవుడు  !

శివుడు ఈ మా శివుడు
ఇలలో మా కుల దేవుడు
ఐ మమ్ముల దీవించిండు
వరమును అందించిండు !

ఆ వర ప్రభావము వల్ల
మోక్షము కలిగెను మల్ల
ఇక తొలిగెను మా దైన్యం
మా జన్మ ఆయెను ధన్యం !

మహా భక్తులారా ఇక వినండి
మా కథనే ఉదాహరణ అండి
చేసుకొని ఇక మీరు మారండి
చేరుతారు మీ దివిసీమ కండి !

అచ్చటనే  శివసత్తులు ఉంటారు
ముచ్చటగా నాట్యం చేస్తుంటారు
ఆనందంతో తిలకించవచ్చు మీరు
పరవశంతో తన్మయం చెందుతారు 

ఈ అదృష్టం అందరికీ కలుగదు
ఇక బ్రతుకుల్లో ఉషస్సు మిగలదు
కడగండ్ల కష్టాల కుంపటి వెలగదు
వెలుగునీడల తెర అసలు కలగదు 



కామెంట్‌లు