కలం చెప్పిన సూక్తులు:- -గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు,సెల్:9966414580.
అక్షరాల సాక్షిగా
అధిగమించు ఒత్తిళ్ళు
మనిషితనం మాలగా
తుడువాలోయ్! కన్నీళ్లు

అందరితో మంచిగా
బ్రతకాలోయ్! మనిషిగా
విజ్ఞానమే మెండుగా
ఉంటే నీకు అండగా

మనసును ఉంచు కుదురుగా
గెలుపు ఇక నీదేగా
మమతను పంచు విరివిగా
ఎద ఎదలో  నీవేగా

సాయం చేసి వీక్షించు
విజ్ఞానాన్ని శోధించు
లోకమే దాసోహము
విజయాలే నీ సొంతము


కామెంట్‌లు