పాతపొన్నుటూరు ఎంపియుపి పాఠశాలలో సాంఘిక శాస్త్రోపాధ్యాయునిగా పనిచేసి బదిలీ అయిన కుదమ తిరుమలరావును ఆ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ పంచాయతీ పెద్దలు, పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ మండలం కడుము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడైన తిరుమలరావు, పనిసర్దుబాటు తాత్కాలిక బదిలీల్లో భాగంగా ఇక్కడ నియామకం పొంది ఏడునెలల పాటు తన సేవలను అందించిరి. మరలా కడుము హైస్కూల్ కు చేరుకున్న రెండు నెలల తర్వాత జి.సిగడాం మండలం పాలఖండ్యాం ఎంపియుపి పాఠశాలకు బదిలీపై నియామకం పొంది ప్రస్తుతం పాలఖండ్యాంలో పనిచేస్తున్నారు. పాతపొన్నుటూరులో సర్వేపల్లి జయంతి గురుపూజోత్సవం, గురజాడ జయంతి, స్వర్ణాంధ్ర, గిడుగు రామమూర్తి జయంతి, హిందీ దినోత్సవం, భారత రాజ్యాంగ దినోత్సవం ఎస్ ఎస్ డే, సైన్స్ డే, మెగా పిటిఎం, రామానుజన్ జయంతి గణిత దినోత్సవం, నూతన సంవత్సర వేడుకలు, సంక్రాంతి సంబరాలు, జాతీయ ఓటర్ల దినోత్సవం, రిపబ్లిక్ డే, పాఠశాల వార్షికోత్సవం, తదితర కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించుటలో తిరుమలరావు మిక్కిలి చొరవ వహించి ఘనమైన సేవలను అందించారు. విద్యా స్థాయిని మెరుగుపర్చే దిశగా పలుసార్లు క్విజ్ పోటీలు, వ్యాసరచన పోటీలు, పఠన పోటీలు, దస్తూరీ పోటీలు, వక్తృత్వ పోటీలు, చిత్రలేఖన పోటీలు, దేశభక్తి గీతాల పోటీలు నిర్వహించి విజేతలకు వందకు పైగా షీల్డ్ లను, ప్రశంసాపత్రాలను, గ్రంథాలను బహూకరించారు. మండల స్థాయిలో జరిగిన స్వర్ణాంధ్ర-2047, గణిత పోటీలు, సైన్స్ పోటీల్లో పాతపొన్నుటూరు ఎంపియుపి పాఠశాల తరఫున విద్యార్థులకు తర్ఫీదునిచ్చి విజేతలుగా నిల్పుటలో తిరుమలరావు తనవంతు కృషి చేసారు. మండల స్థాయిలో జరిగిన సైన్స్ ఫేర్ లో బయో గ్యాస్ ప్రయోగం ప్రదర్శించి ప్రథమ స్థానంలో నిలవగా, ఎన్ఎంఎంఎస్ పరీక్షలలో ఒక విద్యార్ధిణి ఎంపికై పాతపొన్నుటూరు పాఠశాల కీర్తి మారుమ్రోగింది. ఇదిలా ఉండగా గ్రామంలో జరిగిన నూతన శ్రీరామ మందిరం ప్రతిష్ట, కొండ గుడి సంబరాలు, స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ర్యాలీలు, మొక్కలు నాటే కార్యక్రమాలు, నూతన విద్యార్థులను బడిలో చేర్చే కార్యక్రమాలు, ఆరోగ్యశాఖ గర్భిణీ స్త్రీల సామూహిక సీమంతాల వేడుకలు, గౌతమ బుద్ధ జయంతి, వ్యక్తిత్వ వికాసం తదితర కార్యక్రమాలలో తిరుమలరావు పాల్గొని రచనలు పాటలు ఆలపించి, తనవంతు సేవలను అందించి మిక్కిలి జయప్రదం గావించారు. తిరుమలరావు సేవలను కొనియాడుతూ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మావుడూరు మురళీకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన సన్మాన కార్యక్రమంలో మండల విద్యాశాఖాధికారి చందక గోవింద స్వామి, గ్రామ సర్పంచ్ ఎద్దు చామంతమ్మ, వైస్ ప్రెసిడెంట్ డోల చిన్నారావు, స్థానిక యువనేత వై.సంతోష్ కుమార్, పాఠశాల యాజమాన్య కమిటీ ఛైర్ పర్సన్ బలగ రజనీ కుమారి, వైస్ చైర్మన్ గేదెల తేజేశ్వరరావు, విశ్రాంత వీఆర్వో బలగ అప్పారావు నాయుడులు శాలువా జ్ఞాపిక పుష్పగుచ్చం ప్రత్యేక కానుకలు గ్రంథాలతో ఘనంగా సన్మానించారు. ప్రధానోపాధ్యాయులు మావుడూరు మురళీకృష్ణ, ఉపాధ్యాయులు గొర్లె రామారావు, పిలక వసంతకుమారి, పొత్రఖండ నాగభూషణం, పైసక్కి చంద్రశేఖర్, దాము నీరజలు కార్యక్రమ నిర్వహణా బాధ్యతలను విజయవంతంగా చేపట్టి, తిరుమలరావు సేవలను కొనియాడుతూ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల పూర్వ ఉపాధ్యాయులు గుర్రాల కృష్ణారావు, అందవరపు రాజేష్, బూడిద సంతోష్ కుమార్, యిసై సౌజన్యవతి, బొమ్మాళి నాగేశ్వరరావు, మండల రీసోర్స్ సెంటర్ ఉద్యోగి కడగాన అప్పలనాయుడు, ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత పతివాడ రమేష్, బలగ వాసుదేవరావు, అల్లాడ సరస్వతి, బలగ ఔదులమ్మ, బి.తవిటమ్మ, బుద్ధల మీనాక్షి తదితరులు పాల్గొన్నారు.
తిరుమలరావుకు ఘనసన్మానం
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి