సుప్రభాత కవిత ; - బృంద
చప్పుడు చేయక
రెప్పలు కన్న కలలు 
ఎప్పుడెప్పుడని 
ఎదురుచూసే కనులు

రేపటి వెలుగు కోసం
రెప్ప పడని మెలకువతో
రాతిరి ఎదురుచూసి
రేకులు విప్పిన మొగ్గలు

అలల్లా కన్నీళ్లు పొంగుతున్నా 
రెప్పలే చెలియలికట్టలై 
నిగ్రహించి నిట్టూర్చి వేకువకై
ఎదురుచూసే మనసులు

ఎదుట నిలిచిన దేవుని 
రెప్ప వాల్చక చూస్తూ 
మైమరచి మురిసి
నిలిచిపోయిన చూపులు

కనిపించే వెలుగులో 
రెప్పలు మూసి దైవంతో
సాన్నిహిత్యాన్ని  భావించే 
సొగసైన భావుక హృదయాలు

కనుపాపల కలలను 
రెప్పచాటున చూసి
కనుల నిండా నింపుకునే
మౌన హృదయాలు

ఎన్నో మనసులు నిండేలా
రెప్పల వాకిట ముగ్గులు వేసే
కాంతిధారల కమనీయమైన
కొంగొత్త వేకువకు.....

🌸🌸సుప్రభాతం🌸🌸

 

కామెంట్‌లు