కష్టం - అచ్యుతుని రాజ్యశ్రీ

 మనం ప్రతి పని కష్టపడి ఇష్టంతో చేయాలి తేలిగ్గా అక్రమార్గంలో డబ్బు సంపాదించాలి అనుకుంటే కష్టాల్లో పడతాం చిక్కుల్లో ఇరుక్కుని విలవిలలాడతాం మన సంపాదన కూడా అలాగే న్యాయంగా ఉండాలి విద్యార్థి బడి ప్రారంభమైన రోజు నుంచి  ఏ ఏ రోజు పాఠాలు ఆరోజు చదివితే ఫైనల్ ఎగ్జామ్ కి కష్టపడక్కర్లేదు టెన్షన్ ఉండదు అప్పనంగా  లంచాలు మెక్కుతూ కంచాలు భోజనం చేస్తే రోగాలు వస్తాయి కటకటాల పాలు అవుతారు ఇలాంటి కథని  చదవండి ఒక పిట్ట రోజూ తనకు కావలసిన ఆహారాన్ని ఎగురుకుంటూ వెళ్లి వెతుక్కుని పురుగులని ఏరుకుంటూ తిని బతికింది ఒక వేటగాడు దానికి రోజు ఒక చిన్న భరణ నిండా పురుగులని నింపి తీసుకురావడం ప్రారంభించాడు ఆ పిట్ట వాడికి ఒక బంగారు ఈకను ఇచ్చేది. దానితో వాడు కొద్ది రోజుల్లోనే ధనవంతుడయ్యాడు కష్టపడటం మానేశాడు పిట్ట రోజు ఎగరకుండా పురుగులు పొట్ట నిండా తినటం ఆపై ఈకను వేటగాడికి ఇవ్వటంతో అది బాగా బలిసింది ఈకలు పోవడంతో ఎగర లేకపోయింది అలాగే కూర్చుని గూట్లో ఉండిపోయింది ఈ వేటగాడు బాగా సుఖం మరిగి బలిసిన పిట్టను ఇంటికి తీసుకెళ్లి వండి శుభ్రంగా తినేశాడు వాడు తన దాదాగిరితో ఊరివారినందరిని బెదిరించడంతో అంతా కలిసి వాడిని చితకబాది వాడి ఇల్లు కొల్లగొట్టి ఊరి నుంచి తరిమేశాడు ఈ విధంగా పిట్ట వేటగాడు ఇద్దరూ నష్టపోయారు ఎప్పుడు కూడా మనం సోంబేరుగా ఒకే చోట కూర్చుండకుండా నడుస్తూ ఉండాలి. దగ్గర షాప్ కి స్కూటర్ వేసుకుని బయలుదేరకూడదు అలాగే ఆలయానికి కూడా నడుస్తూ వెళ్లాలి అంతేకానీ నాకు స్కూటర్ ఉంది కారు ఉంది అని ఫర్లాంగు దూరం లేని వాటికి వాహనాల్లో వెళ్ళటం వల్ల ఊబకాయం వస్తుంది రకరకాల రోగాలు వస్తాయి దాని బదులు దైవ స్మరణ చేస్తూ నడుస్తూ ఆలయానికి వెళ్ళటం వల్ల ఆరోగ్యం ఆనందం భక్తి అలవాడతాయి ఇక ఇంకో కథ చూద్దాం ఒక తాత మనవడు చెట్లు పెంచాలని పందెం కట్టారు మనవడు అన్నాడు తాత నేను ఇంట్లోనే మొక్కను పెంచుతాను దానివల్ల వాతావరణ కాలుష్యం ఉండదు కానీ తాత మాత్రం తన మొక్కను ఇంటి పెరట్లో బయట పాతాడు ఒక ఏడాదికల్లా ఇంట్లో ఉన్న మొక్క ఎదుగు బదుగు లేక గెడస బారింది తాత వేసిన మొక్క లు వాకిట్లో బోలెడన్ని పూలు పూసి అందం ఆకర్షణ తో పాటు దైవ పూజలు వినియోగింపబడి జన్మ సార్థకం చేసుకుంది దొడ్లో వేసిన మొక్క కాయలు కాసి ఇంటికి కావలసిన కూరలు అందించింది కాబట్టి మనం మొక్కలు నాటేటప్పుడు కూడా వాటిని వినియోగపడేలా ఆలోచించి సూర్యరశ్మి తగిలేలా నాటాలి అలాగే వాటికి ఎరువుగా వంటింట్లో తరిగిపడేసిన కూరగాయ చెక్కులు ఉల్లిపొట్టు వేస్తూ ఉంటే పర్యావరణహితం అవుతుంది ఇప్పుడు పూజలు పూజ పేరుతో గుడిలో బోలెడన్ని పూలు చెత్తబుట్టలో పడేస్తున్నారు అలా కాక వాటిని ఏరి రకరకాల సెంటు స్ప్రే తయారు చేయొచ్చు అలాగే ఒక గుంత తీసి అందులో ఈ వాడిన పూలను వేస్తే కొన్నాళ్ళకి ఎరువుగా మారుతుంది దీన్నే సేంద్రియ ఎరువు అంటారు ఇలాంటి చిట్టి చిట్టి పనులు గుడికి వచ్చే భక్తులు బడిలో పిల్లలు ఆచరించాలి కొబ్బరికాయలు కొట్టి ఆ నీటిని వృధాగా నేలపాలు చేస్తారు గుడిలో అలా కాకుండా పక్కన ఒక గిన్నె పెడితే కొబ్బరికాయ కొట్టి ఆ నీరు గిన్నెలో పోస్తే తీర్థం లాగా ఉపయోగపడుతుంది దీన్ని మనం ఇప్పుడు ప్రతి గుడిలో ఆచరించి చూపాలి ఏదీ కూడా వ్యర్థం కాలేదు🌹
కామెంట్‌లు