కాల్వశ్రీరాంపూర్ మండలం ఊషన్నపల్లి ప్రభుత్వ ఇంగ్లీష్ మీడియం ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులు ఈర్ల సమ్మయ్య, ఉపాధ్యాయుడు అమృత సురేష్ కుమార్ లు రాష్ట్రస్థాయి ఆన్లైన్ పాటల పోటీలో అత్యంత ప్రతిభ కనబరిచారు. జమ్మికుంటకు చెందిన ఫ్యాక్ట్ స్వచ్ఛంద సంస్థ ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులకు రాష్ట్ర స్థాయి ఆన్ లైన్ పాటల పోటీలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పాటల పోటీలో లైకుల ఆధారంగా విజేతలను ఎంపిక చేస్తారు. ఈ పాటల పోటీలో పాల్గొన్న ఊషన్నపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాశాల ఉపాధ్యాయులు సురేష్ కుమార్, ఈర్ల సమ్మయ్య లు పాల్గొన్నారు. సురేష్ కుమార్ 684 లైకులు, 3,942 వ్యూస్ తో రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానంలో నిలవగా, ఈర్ల సమ్మయ్య 607 లైకులు, 7,455 వ్యూస్ తో తృతీయ స్థానంలో నిలిచారు. ఈ పోటీల్లో జమ్మికుంట ఏరియాకు చెందిన యేభూషి సతీష్ కుమార్ 842 లైకులు, 4,915 వ్యూస్ తో ప్రథమ స్థానంలో నిలిచారు. ఊషన్నపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నుంచి ఇద్దరు ఉపాధ్యాయులు సురేష్ కుమార్, ఈర్ల సమ్మయ్య రాష్ట్ర స్థాయి ఆన్లైన్ పాటల పోటీలో ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలవడంతో గ్రామస్తులు, మండల ప్రజలు, అధికారులు, ప్రజా ప్రతినిధులు వారి మిత్రులు శ్రేయోభిలాషులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒకే స్కూల్ నుంచి ఇద్దరు ఉపాధ్యాయులు రాష్ట్రస్థాయి పాటల పోటీల్లో ఎంపిక కావడం గొప్ప విషయంగా భావిస్తున్నారు. దీంతో ఊషన్నపల్లి పేరును రాష్ట్రస్థాయిలో తీసుకెళ్లినట్లయింది. ఈ సందర్భంగా ఈర్ల సమ్మయ్య మాట్లాడుతూ జమ్మికుంటకు చెందిన ప్యాక్ట్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులకు, మిత్రులు, శ్రేయోభిలాషులు, ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ప్యాక్ట్ స్వచ్ఛంద సంస్థ వారు ప్రతి ఏటా ఇలాంటి కార్యక్రమాలను క్రమం తప్పకుండా నిర్వహించి ఉపాధ్యాయుల్లో దాగి ఉన్న కళను వెలికి తీయాలని ఆయన కోరారు. తాను పాడిన 'అమ్మ పాడే జోల పాట' ను విశేషంగా ఆదరించి, చూసి, అధిక సంఖ్యలో లైకులు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఈర్ల సమ్మయ్య ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేశారు. తన చేపడుతున్న కార్యక్రమాలను వీక్షించి, అభిమానించి ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ఆయన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేశారు.
రాష్ట్రస్థాయి పాటల పోటీల్లో ఊషన్నపల్లి ఉపాధ్యాయుల ప్రతిభ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి