విజయమ్మ ఇంటికి
విజయవాడ వెళదామని
విజయదశమి కి రమ్మందని
మనుమరాలి కొడుక్కి
పుట్టు వెంట్రుకలు తీసారని
ఓపిక లేదు అనవద్దని
ఏభై ఏండ్లయి కాపురం చేస్తున్న
నా ధర్మపత్ని అంటే
అదేమిటే నేనింకా యవ్వనంలో ఉన్నానని
విజయవాడ వెళితే
తాతయ్య అమ్మమ్మ
నా కొడుకుతో కారులో
కనకదుర్గమ్మ గుడికెళదామని తీసుకెళ్ళి
ప్రత్యేక దర్శనం లో
కుంకుమార్చన చేసి
గుడి బయటికి వస్తే
తాతయ్య మీ దంపతులిరువురే
మాకు పార్వతీ పరమేశ్వరులని
మునిమనుమడిని
ఎత్తుకోగలరా ఫోటో తీస్తానంటే
అదేమిటి నా కేమంత వయస్సు అని
చలిమిడి ముద్దలా గుండుతో
పసిడిబొమ్మలా ఉన్న
మునిమనుమడిని ఎత్తుకుని
భార్యతో సహా ఫోటో తీసిన
మనుమరాలి దంపతులిద్దరిని మునిమడిని ఆశీర్వదించాను...!!
..........................
మునిమనుమడితో పండుగ వేళ:- .కవిమిత్ర,, సాహిత్యరత్న-ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్-(పుష్యమి)-విశాఖపట్నం.
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి