అదః పాతాళంలోంచి అమ్మ అన్న పిలుపుతో
కరుణామయి ఆమె
కౌగిట్లో కరిగించింది.
కుడితేనే తేనెటీగ విషయమైనట్లు
తింటేనే తేనే తీయనైనట్లు
పూలు మకరందం పంపినట్లు
ముఖానికి గంధం పూసినట్లు
ఆమె అలోకిక ఆనందం ఇచ్చి
నేలంతా పూల పాన్పు పరిచి
సుగంధాన్ని చల్లింది.
చల్లని చంద్రుని వెన్నెల మనసంతా స్పృశించి
మల్లె మొగ్గల విరబూసి నట్లు
మౌనంగా పందిరంతా తెల్లని స్వప్నమైంది.
లేలేత చిగురు తొడిగినట్లు
మెత్తని పలుకులతో మత్తునిచ్చిన
మూగ ప్రేమలో మాటలు మాయమైనవీ
అర్ధనిమీలిత నేత్రాలు
మానస సరోవరలా మారీ ఆధరాల్లా
అమృతం తాగి తూగుతున్నవీ.
ఉల్లాసం హంసల్ల ఊయలలోకినట్లు నీలి సముద్రంలో ఈదుతున్నవీ.
మధురమైన భావనలు భూమిని దాటి ఆకాశపు ఏటిలో కొట్టుకుపోతున్నాయి.
మెరిసే నక్షత్రాలు కిందికి దిగి నలిగి అలిగీ పోతున్నాయి.
ఆకాంక్షలు బెదిరి చెదిరి చెదిరి సందెపొద్దుల పాన్పుల్లో నిదుర లేపుతున్నవి.
నీరెండలా గుండె గుబులుగా వెచ్చబడుతున్నది ఇప్పుడిప్పుడే
గుప్పుమన్న ప్రేమ బంధం ఆరిపోయిన గంధంలా అందనంత అందంలో కలిసిపోయింది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి