సాహితీ కవి కళాపీఠంసాహితీ కెరటాలు----------------------మానవాకారానికి శ్రీకారం చుట్టిన రోజునుండీ,చరితలో మలుపులున్న ఘటనలను కాగితపు పుటలలో లిఖిస్తే ...ఏ పుటలో ఏమున్నా అదో అంతులేని కథౌతుంది.ఆఖరి పేజీలో చరితకు ముగింపు కనపడుతుంది.జీవిత దశలలో చేయవలసిన పనులు చేయకుండా,చేయకూడని పనులు ఎన్నెన్నో చేసి ఉండొచ్చు.నిత్య కర్మలు ఎటూ తప్పవు, నైమత్తిక కర్మలను చేశాడో లేదో!ఆఖరి మజిలీలో కళ్ళు తెరిస్తే లాభమేముంటుంది!ఈ లోకంలో నివాసం శాశ్వతమని భావించే ఉండొచ్చు.కూడబెట్టడానికి ఏమేమి పనులు చేసుంటాడో ఊహించలేం.పెంచుకున్న మమకారాల నడుమ ఎంత నలిగిపోయాడో తెలియదు.చివరికి ఎవరినీ వదిలి వెళ్ళలేక ఎలాంటి తపన పడ్డాడో ఏమో!ఎవరు కోసం చేశాడో వాళ్లే పట్టించుకోని రోజులలో,జ్ఞాపకాల తెరలలో కదలాడే ఘటనలు నిదురను దూరం చేస్తుంటే ...కళ్ళ ముందు సహచరులు ఒక్కొక్కరూ పైకి పోతుంటే ...ఇంకా తీరని ఆశల తలపులకు ఊపిరి తలుపులు మూసుకుపోవచ్చు.ఆఖరి చూపుల కోసం పరిగెత్తుకొని వచ్చేవారు ...ఆ దేహం ఆఖరి పేజీలోని స్థితిని చూడటానికి కాదు.కూడబెట్టి కూడా తీసుకెళ్లలేని పాపాన్ని పంచుకోవడానికి.తీరిపోయిన బంధాలకు ఆఖరి వీడ్కోలు చెప్పి ఊపిరి తీసుకోవడానికే.•••••••••••••~•
ఆఖరి వీడ్కోలు:- విత్తనాల విజయకుమా కుమార్-హైదరాబాద్.
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి