సామెత -51:- అన్నోళ్ళు మంచిగుండ్రు, పడ్డోళ్ళు మంచిగుండ్రు - నడుమున్నోళ్ళె నలిగి చచ్చిండ్రు.
*****
అవ్వా!ఇగ జూస్నవా! గిదేమన్న లాయికయితదా నువ్వే జెప్పు! గా శంభయ్య కొడ్కు లగ్గబలం రాట్లేదని ఎంత బుగులు బడ్డడో నీకెరికే గద!పెండ్లిల్ల పేరయ్య మంచి సంబందాలు పట్కొత్తల్లేడని మీ మర్ది సుట్టు ఆసుబోశినట్టు తిర్గింది నీకు సుత దెల్సుకద!
"అవునే శెల్లె! గింతకి ఏమైంది? మర్ది సంగతి నాకెందుకు తెల్వదు.ఎవలన్న ఏదన్న అడిగితే కాదన్లేడు.కాళ్ళరిగే దనుక తిర్గి సాధించుకొత్తడు.గందుకే గద మనూల్లె మెతక మడిసని" అంటరు.
ఇంగో అవ్వా! గా మెతకదనమే ఆయన మనసు నల్గేదాంక తీసుకొచ్చింది. పెండ్లి కుదిరిచ్చినప్పుడే చెప్పిండు. వియ్యమంద్కో బోతున్నరు. చిన్న చిన్న తప్పులు గిప్పులేమైనుంటె సర్దుకోవాలి. బతుకంతా కల్సి ఉండాల్సినోళ్ళని చెప్పిండంట. పెట్టుబోతల కాడ లొల్లి బెట్కుంటుంటే ఆపిండంట. పెళ్ళి సుత దగ్గరుండి జేయించిండు. పెండ్లయిన కానించి పెండ్లిల గది తక్వయింది,గిది తక్వయింది అని పెద్ద పెద్దగ తిట్టినోళ్ళు , మాటలు బడ్డోళ్ళు మంచిగనె ఉండ్రు.
గిప్పుడేమో మా ఆయన్ని బట్కొని పద్దతి దెల్వని సంబంధం దెచ్చిండ్రని ఒకలు. గిస్మంటోళ్ళు అనుకోలేదని ఇంకొకలు అంటుంటే.. గీయనేమో ఏదన్నుంటే గాళ్ళు గాళ్ళు జూస్కోవాలె గని నన్ననుడేందని...గవి దినాం తల్సుకొని రంధి పడ్తుండవ్వా!"
"శెల్లే! గింతకీ పిల్ల పిలగాడు ఎట్లన్నరు.సక్కరంగ కాపురం జేస్కుంటుండ్రా?
"గాల్లెక్కడో! పట్నంల మంచిగనే ఉండ్రంట. మరి గీళ్ళకేమయ్యిందో గిట్ల శికాకు జేత్తుండ్రు.
గా పిల్ల, పిలగాడు మంచిగుండ్రు గద.గది జాలు శెల్లె! మర్దిని అస్సలు రంధి పడొద్దని జెప్పు.పెండ్లి సంబందాలల్ల మద్దెవర్తిగుంటె గిట్లనే ఉంటది.గందుకే మన పెద్దోళ్ళు ఊకెనే అన్లే"అన్నోళ్ళు మంచిగుండ్రు పడ్డోళ్ళు మంచిగుండ్రు - నడుమున్నోళ్ళు నలిగి చచ్చిండ్రు"అని.గిదే గాదు శెల్లె! ఎవలన్న ఇద్దరు కయ్యం బెట్కొని శెయ్యి శెయ్యి గల్పెటోళ్ళ మద్దెనకెళ్ళి గాళ్ళకు నచ్చజెప్ప బొయినమా! ఇంగ నల్గి సచ్చుడే.గట్లని మన్సాగదు కొందర్కి. మంచి జెయ్యాలని బోతరు.గిట్లనే నలిగిపోతుంటరు శెల్లె.
"నువ్వన్నది సత్తెం అవ్వా!ఎవలి పాపం ఆళ్ళకే.మనమైతె మంచి జేసినం.పాపం పున్నెం బగమంతునికి తెలుత్తనే ఉంటది"అన్కుంట.నీ మాటంటె గురి.గిదే ముచ్చట మా ఆయనకి జెప్త"అన్కుంట బోయింది శివమ్మ.
గదండీ సంగతి! "అన్నోళ్ళు మంచిగుండ్రు, పడ్డోళ్ళు మంచిగుండ్రు- నడుమున్నోళ్ళు నలిగి చచ్చిండ్రు" అంటే గిదే మరి. మద్దెవర్తిగుంటె గిస్మంటివి ఎదుర్కోవాలె.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి