సూరేపల్లి రాములమ్మ ఉమెన్ వెల్ఫేర్ ట్రస్ట్ సేవలు భేష్

 నవమల్లెతీగ మాసపత్రిక సంపాదకుడు కలిమిశ్రీ
సాహిత్యపరంగానూ, సామాజకపరంగానూ ఎన్నో సేవలందిస్తున్న సూరేపల్లి రాములమ్మ ఉమెన్ వెల్ఫేర్ ట్రస్టు సేవలు అనన్యసామాన్యమైనవని నవమల్లెతీగ మాసపత్రిక సంపాదకుడు కలిమిశ్రీ అన్నారు. ఆదివారం శ్రీ దుర్గామల్లేశ్వర సిద్ధార్థ మహిళా జూనియర్ కళాశాల మరియు సూరేపల్లి రాములమ్మ ఉమెన్ వెల్ఫేర్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు మరియు జూటూరి విజయలక్ష్మి జాతీయ విశిష్ట ప్రతిభా సాహిత్య పురస్కార ప్రదానోత్సవ సభ జరిగాయి. ఈ సభకు ముఖ్యఅతిథిగా హాజరైన కలిమిశ్రీ మాట్లాడుతూ- మూడు దశాబ్దాలుగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థుల ప్రతిభాపాటవాలను వెలికి తీసేవిధంగా వివిధ ప్రక్రియల్లో పోటీలు పెడుతూ, సాహిత్యసేవలో నిష్ణాతులైన సాహితీవేత్తలు పురస్కారాలిస్తూ, పేద రచయితల పుస్తకాలను ఉ చితంగా ప్రింట్ చేయిస్తూ ఎనలేని సేవలందిస్తున్నందుకు మనం గర్వపడాలన్నారు. శ్రీ దుర్గామల్లేశ్వర సిద్ధార్థ మహిళా జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ డా.ఎస్.పద్మజ మాట్లాడుతూ- సూరేపల్లి రాములమ్మ ఉమెన్ వెల్ఫేర్ ట్రస్ట్లో మా కళాశాల అనుబంధం కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జూటూరి విజయలక్ష్మి జాతీయ విశిష్ట ప్రతిభా సాహిత్య పురస్కారాన్ని సాహితీవేత్త దండే స్వర్ణవాహినికి అందజేశారు. అనంతరం వివిధ అంశాలపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలైన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో ట్రస్టు ఛైర్మన్ సూరేపల్లి రవికుమార్, రచయిత్రి స్నిగ్ధమాధవి, లెక్చరర్స్, విద్యార్థినులు పాల్గొన్నారు.
కామెంట్‌లు